మెగా సూపర్ మేన్ కావాలనుకుంటున్నాడా?

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్క్రీన్ మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ఏ కోణంలో అయినా మెప్పించగలిగే సమర్ధుడు. అవసరమైతే ప్లే బోయ్ గా మారిపోతాడు. లేదంటే గద్దలకొండ గణేష్ గా అయినా మారిపోగలడు. సైనికుడిగానూ నటించి మనసు దోచాడు. అవసరానికి తగ్గట్టే ఆహర్యంలో మార్పు తేగలడు. పాత్రను బట్టి తనని తాను మలుచుకునే సమర్థత తనకు ఉంది. ప్రస్తుతం తాజా సినిమా కోసం బాక్సర్ గా తర్ఫీదు పొందుతున్నాడు. రియల్ బాక్సర్ ని తలపించడం కోసం కఠినమైన శిక్షణ లో ఆరి తేరుతున్నాడు. దాదాపుగా నాలుగు నెలలుగా ట్రెనింగ్ లోనే ఉన్నాడు. బెస్ట్ బాక్సింగ్ కోచ్ ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నాడు. అలాగే తన రోల్ కి తగ్గట్టే రూపంలోనూ బారీ మార్పులు చేసాడు. అందుకోసం జిమ్ములోనే వర్కౌట్లతో అంతే శ్రమిస్తున్నాడు. మేకోవర్ లో భాగంగా వర్కౌట్లు తప్పడం లేదు.

స్క్రీన్ ప్రజెన్స్ బాగుండాలంటే ఇవన్నీ తప్పనసరి. వచ్చే నెలలో రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతున్న కొత్త సినిమా కోసం ఇవన్నీ చేస్తున్నాడు. ఆ విషయం పక్కన బెడితే వరుణ్ కి హెచ్ బీ వో ఇండియా తనకిష్టమైన డీసీ కామిక్ ఆట బొమ్మలను బహుమతి గా ప్రెజెంట్ చేసింది. బాట్ మ్యాన్ మాస్క్.. వండర్ మెన్…సూపర్ మెన్ మాస్క్ ల్ని.. ఓ కారు బొమ్మను డీసీ సంస్థ పంపించింది.

మరి ఈ వయసులో వరుణ్ కి వీటితో పనేంటి అనుకుంటున్నారా? వరుణ్ కి సూపర్ మేన్ బొమ్మలన్నా..మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమట. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి వదలకుండా చూసేవాడుట. అది గుర్తించే హెచ్ బీ ఓ ఇండియా వాటిని వరుణ్ కోసం ప్రత్యేకంగా పంపించింది. ఆ విషయాన్ని వరుణ్ ట్విటర్ లో షేర్ చేస్తూ హెబీఓ ఆఫ్ ఇండియా కు కృతజ్ఞతలు తెలిపాడు. అన్నట్టు ప్రఖ్యాత డీసీ ఫ్రాంఛైజీల సినిమాలకు రానా కూడా ప్రమోషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్టర్నేట్ గా వరుణ్ తేజ్ కాంపిటీటర్ గా మారనున్నాడు. వరుణ్ ఆసక్తిని చూస్తుంటే అతడు కూడా భవిష్యత్ లో సూపర్ మేన్ కావాలనుకుంటున్నాడనే అర్థమవుతోంది.
Please Read Disclaimer