బాక్సర్ అంటే ఈమాత్రం లేకుండా ఎలా?

0

గతంలో హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా కూడా ఒకే తరహా ఫిజిక్ తో కనిపించే వారు. అప్పట్లో సినిమా సినిమాకు అసలు గ్యాప్ తీసుకోకుండా చేసేవారు. కనుక ఒక హీరో ఎన్ని సినిమాలు చేసినా కూడా అన్ని సినిమాల్లో కూడా ఒకే విధంగా కనిపించే వారు. కాని ఇప్పుడు అలా కాదు. పరిస్థితి మారిపోయింది. హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా కనిపిస్తున్నారు. ఫిదా.. వెంకీ మామ.. గద్దల కొండ గణేష్ ఇలా సినిమాకు ఒక్కో విధంగా ఆ సినిమా లోని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్లుగా వరుణ్ తేజ్ తన ఫిజిక్ ను మార్చుకుంటూ వస్తున్నాడు.

ప్రస్తుతం బాక్సర్ పాత్రలో నటించేందుకు వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం గురించి వార్తలు అయితే వస్తున్నాయి కాని సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. ఎట్టకేలకు ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందనే విషయమై క్లారిటీ వచ్చింది. వరుణ్ తేజ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా ఫిజిక్ విషయంలో వరుణ్ తేజ్ వర్కౌట్స్ చేస్తున్నట్లు గా ఉన్నాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూస్తుంటే వరుణ్ ఏ మేరకు కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

వరుణ్ తేజ్ ఫిజిక్ కు అంతా కూడా అవాక్కవుతున్నారు. ఇదే సమయంలో బాక్సర్ అంటే ఈమాత్రం లేకుంటే ఎలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ ఏ పాత్ర చేసినా కూడా దానికి జీవం పోసేందుకు చాలా కష్ట పడుతాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువ కష్టపడుతున్నట్లుగా ఈ ఫొటోలను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer