అన్నను హిట్లర్ అంటూ ఫన్నీగా

0

ఆ అన్నకు ఐదుగురు చెల్లెళ్లు. అందరి బాధ్యతలు తనవే. ఎవరూ లేని అనాధల్ని కానియ్యకుండా అందరినీ పెంచి పోషించి పెద్ద వాళ్లను చేసి ఓ అయ్యకు కట్టబెట్టేవారకూ బాధ్యత తనదే. అది ఎంత బరువైన పని. అందుకోసం ఆ అన్నయ్య ఎంత స్ట్రిక్టుగా బతికాడో `హిట్లర్` సినిమాలో చూశాం. అంత బరువు మోసిన అన్నయ్యను చివరకు అపార్థం చేసుకుని ప్రేమించిన వాళ్లతో వెళ్లిపోయేందుకు చెల్లెళ్లు చేసిన పనిని అటుపై రియలైజేషన్ వగైరా వగైరా సెంటిమెంటు సీన్లు మర్చిపోలేం. అన్నయ్యతో గొప్ప అనుబంధం ఉండేది చెల్లెలికే.

అది ప్రతిసారీ పడగల వేళ ఇదిగో ఇలా బయటపడుతుంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఎరేంజ్ చేసిన దీపావళి పార్టీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇలా తన ఐదుగురు చెల్లెళ్లతో కలిసి కనిపించాడు. నీహారిక సహా సుశ్మిత- శ్రీజ తదితరులు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫోటో ఫ్యాన్స్ లో జోరుగా వైరల్ అవుతోంది. అక్క చెల్లెళ్లతో వరుణ్ అనుబంధం ఎంత ముచ్చటగొలుపుతోందో! అంటూ అందరూ పొగిడేస్తున్నారు.

అయితే నిహారిక మాత్రం కాస్త కొంటెగా `హిట్లర్ పిక్చర్` అంటూ కామెంట్ చేయడంతో తనకు అన్నివిధాలా అండగా నిలిచే అన్నయ్యకు సరైన పేరునే పెట్టిందే అంటూ అంతా ముచ్చటించుకుంటున్నారు. నిహారిక నటించే సినిమాలకు వరుణ్ పూర్తిగా బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి అన్నతో నిహారికకు ఎంతో గొప్ప అనుబంధం ఉంది. అందుకే తనని అప్పడప్పుడు అలా ఆటపట్టిస్తుంటుంది ఫన్నీగా.
Please Read Disclaimer