సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

VT10: ముంబై లో 2 నెలలు ప్రిపరేషన్

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా ‘వాల్మీకి’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా సూపర్ హిట్ కాలేదు కానీ వరుణ్ పాత్రకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ‘వాల్మీకి’ తర్వాత ఎక్కువ టైమ్ తీసుకోకుండా వరుణ్ తన నెక్స్ ఫిలిం ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ ఒక బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే త్వరలో వరుణ్ ముంబైకి వెళ్ళి బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటాడట. దాదాపు రెండు నెలల పాటు బాక్సింగ్ ట్రైనింగ్ సెషన్స్ ఇంటెన్స్ గా సాగుతాయని అంటున్నారు. ఈ రెండు నెలల సమయంలో వరుణ్ వెయిట్ కూడా తగ్గించుకుని ఒక పర్ఫెక్ట్ బాక్సర్ తరహాలో కనిపించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. నిజానికి ఈ సినిమా కోసం కొంత కాలం క్రితం అమెరికాలో ఒలింపిక్ విన్నర్ టోనీ జెఫ్రీస్ వద్ద రెండు నెలల పాటు బాక్సింగ్ ప్రాక్టిస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ‘వాల్మీకి’ సినిమా ముందుగా పట్టాలెక్కించడంతో ఈ స్పోర్ట్స్ డ్రామాను పక్కన పెట్టారు.

వరుణ్ తన బాక్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ లో హైదరాబాద్ తిరిగి వస్తాడని.. ఈ సినిమా రెగ్యులర్ షూట్ జనవరి నుంచి ప్రారంభిస్తారని సమాచారం. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు వెంకటేష్.. సిద్దు ముద్దా కలిసి నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Please Read Disclaimer