బ్యాలన్స్ తప్పిన రౌడీ.. ఇది కూడా వైరల్ ఏంట్రా బాబు?

0

మనిషి అన్నప్పుడు ఏదో ఒక చోట తప్పు చేయడమో లేదంటే కాలు జారడమో లేదంటే ఏదో చిన్న చిన్న గాయాలు అవ్వడమో జరుగుతూనే ఉంటుంది. అలాంటివి చిన్న చిన్నవి జరిగినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు. కాని సెలబ్రెటీలకు అలా ఏమైనా జరిగితే మాత్రం అది వైరల్ అవ్వడం ఖాయం. విజయ్ దేవరకొండ కాస్త స్లిప్ అయ్యి కింద పడబోయాడు. కింద పడకుండానే ఆయన పక్కన ఉన్న వారు పట్టుకున్నారు.

వారు పట్టుకోకున్నా కూడా విజయ్ దేవరకొండ పడకపోయేవాడేమో. కాస్త మొగ్గి మళ్లీ బ్యాలన్స్ అయ్యేవాడేమో. కాని ఇప్పుడు విజయ్ దేవరకొండ బ్యాలన్స్ తప్పాడు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. అంత చిన్న తడబాటు కూడా ఇంతగా వైరల్ అవ్వాలా అంటూ కొందరు నోరు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ డంకు ఇది నిదర్శణం అంటూ ఆయన అభిమానులు గొప్పలు చెబుతున్నారు.

పూరి దర్శకత్వంలో చేస్తున్న లైగర్ సినిమా షూటింగ్ ను ఒక హార్బర్ లో చిత్రీకరణ చేసేందుకు యూనిట్ సభ్యులు వెళ్తున్నారు. దర్శకుడు హీరోయిన్ ఇతరులు అంతాబాగానే వెళ్లారు. కాని అభిమానులు గట్టిగా మొత్తుకుంటూ ఉంటే విజయ్ దేవరకొండ పైకి చూస్తూ కాస్త స్లిప్ అయ్యి బ్యాలన్స్ ఔట్ అయ్యి పడబోయాడు. కొన్ని క్షణాల్లోనే తేరుకుని విజయ్ అక్కడ నుండి వెళ్లి పోయాడు. కాని మీడియా మాత్రం అక్కడే ఉండి ఆ సంఘటనను వైరల్ చేస్తూనే ఉంది.

 

View this post on Instagram

 

Slippery when wet, cautious Vijay ji you are precious to all of us✋

A post shared by Viral Bhayani (@viralbhayani) on
Please Read Disclaimer