యాంగ్రీ మేన్ నెక్ట్స్ ఏంటి?

0

యాంగ్రీమేన్ రాజశేఖర్ నటించిన `కల్కి` ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించారు. క్రిటిక్స్ నుంచి `కల్కి`పై మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజశేఖర్ నటించే సినిమా ఏది? అంటే రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే కల్కి సీక్వెల్ చేసే అవకాశం ఉందని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. కల్కి తర్వాత వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `పీఎస్ వీ గరుడవేగ` సీక్వెల్ చేస్తానని తెలిపారు. ప్రవీణ్ .. ప్రశాంత్ వర్మ ఇద్దరికీ తన కాంపౌండ్ లో సినిమాల్ని ఖాయం చేశారు.

ఆ రెండు సీక్వెల్స్ సంగతి అటుంచితే వాటితో పాటే రాజశేఖర్ వేరొక దర్శకుడు వినిపించిన కథను ఓకే చేశారట. పీఎస్వీ గరుడవేగ.. కల్కి రెండూ సీరియస్ డ్రామాలు కాబట్టి వీటికి భిన్నంగా కాస్త జోనర్ మార్చి వేరొక సినిమా చేయాలని రాజశేఖర్ భావిస్తున్నారట. అది కూడా `అల్లరి ప్రియుడు` తరహాలో కామెడీ ఎంటర్ టైనర్ అయితే బావుంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. రాజశేఖర్ సీరియస్ డ్రామాల నుంచి బయటపడేందుకు ఈ ప్రయత్నం చేయబోతున్నారట.

అయితే ఆ తరహా స్క్రిప్టు ఎవరు వినిపిస్తారు? అంటే ఓ దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఆయనే `భాయ్` ఫేం వీరభద్రమ్ చౌదరి. అల్లరి నరేష్ హీరోగా `అహనా పెళ్లంట` లాంటి హిట్ సినిమా తీశారు వీరభద్రమ్. తొలి ప్రయత్నం చక్కని సక్సెస్ దక్కించుకుని వెంటనే అగ్ర హీరో నాగార్జునతో సినిమా చేశారు. `భాయ్` మిస్ ఫైరైంది. దాంతో కింగ్ నాగార్జున వీరభద్రమ్ పై సీరియస్ అవ్వడం అప్పట్లో చర్చకొచ్చింది. ఆ తర్వాత వీరభద్రం చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎట్టకేలకు రాజశేఖర్ ఆయనకు ఓ ఛాన్స్ ఇస్తున్నారన్న ముచ్చట ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home