ఎప్పుడు వస్తావు వెంకీ మామ?

0

విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న వెంకీ మామ షూటింగ్ అయితే రెగ్యులర్ గా జరుగుతోంది కానీ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముందు సెప్టెంబర్ లోనే రావొచ్చన్న ప్రచారం జరిగింది. షూట్ ప్రోగ్రెస్ కూడా దానికి తగ్గట్టే ఉందని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కానీ అంతలో ఏమయ్యిందో ఏమో కానీ వెంకీ మామ కాస్త స్లో అయ్యాడు. అక్టోబర్ దాకా వచ్చే పరిస్థితి లేదని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే మంచి బిజినెస్ డీల్స్ వస్తున్నాయి. శాటిలైట్ కూడా భారీ రేట్ కు సెటిలయ్యిందని వినికిడి.

దసరా పండుగను టార్గెట్ చేసుకుని అక్టోబర్ 4 వచ్చే దిశగా నిర్మాత సురేష్ బాబు ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ సైరా ఇప్పటికే అక్టోబర్ 2ని టార్గెట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేసింది. డెడ్ లైన్ మీట్ అవుతారో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆ తేదీనే మెగా ఫ్యాన్స్ కౌంట్ లోకి తీసుకుంటున్నారు. అలాంటప్పుడు వెంకీ మామ సైరాతో ఢీ కొట్టడం అంత సేఫ్ అనిపించుకోదు. ఇప్పటికి సైలెంట్ గా కనిపిస్తున్నా ప్రమోషన్ మొదలయ్యాక సైరా మీద అంచనాలు ఇలా ఉండవు. అందులోనూ చిరంజీవి సినిమా వచ్చి రెండేళ్లు దాటేసింది.

ఈ నేపథ్యంలో ఆకాశమే హద్దుగా హైప్ వస్తుంది. కంటెంట్ ఎలా ఉన్నా కనీసం ఒక వారం దాకా సైరా వసూళ్లకు ఎలాంటి ఢోకా ఉండదు. అలాంటిది కేవలం రెండు రోజుల గ్యాప్ తో వెంకీ మామా పోటీకి దిగడం చాలా రిస్క్. పోనీ అక్టోబర్ 10 లేదా 11 వద్దామనుకుంటే అప్పటికే దసరా సెలవులు అయిపోతాయి. ఓ సీజన్ మిస్ అయినట్టు అవుతుంది. అందుకే వెంకీ మామ సెప్టెంబర్ లోనే వచ్చేస్తే బెటర్. అనుకోవడానికి బాగానే ఉంది కానీ అది దర్శకుడు బాబీ చేతిలో ఉంది. ఇంకొద్ది రోజులు ఆగాక వెంకీ మామ అసలు స్టేటస్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ సస్పెన్స్ తప్పదు
Please Read Disclaimer