వైరల్ వీడియో: వెంకీ.. సల్మాన్ డ్యాన్స్!

0

విక్టరీ వెంకటేష్ డాటర్ అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ కోర్స్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ తో ఆదివారం నాడు జైపూర్ లో జరుగుతోంది. ఇరు కుటుంబాలకు సంబంధించిన దగ్గరి బంధువులు.. సన్నిహిత మిత్రులు మాత్రమే పాల్గొన్న ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఈ పెళ్ళికి ముందు జరిగిన సంగీత్ లో సెలబ్రిటీలు ఫుల్ గా హంగామా చేశారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వెంకటేష్ కు మంచి స్నేహితుడన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఈ కార్యక్రమానికి హాజరవడమే కాదు.. సంగీత్ లో వెంకీతో కలిసి డ్యాన్స్ చేస్తూ తెగ అల్లరి చేశారు. హిందీ సినిమా ‘కిక్’ లోని ఝమ్మే కి రాత్ హై పాటకు వెంకటేష్.. సల్మాన్ ఖాన్ లు రచ్చగా డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోగా.. మధ్యలో రానా కూడా వచ్చి వారితో కలిసి రెండు స్టెప్పులు అలా వేసి పక్కకెళ్ళాడు. ఇక సల్మాన్.. వెంకీలు డ్యాన్స్ లు మాత్రమే కాకుండా ఒకరినొకరు ఆత్మీయంగా కౌగలించుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది.

ఇప్పుడు వారు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంగీత్ లో వీరే కాదు..నాగ చైతన్య.. సమంతా.. రానాలు కూడా డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లేలా డ్యాన్స్ చేశారని సమాచారం. జైపూర్ లో వివాహ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సోమవారం హైదరాబాద్ చేరుకుంటారట. వివాహం ప్రైవేట్ ఈవెంట్ గా జరిగినప్పటికీ.. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో భారీ స్థాయిలో జరుపుతున్నారట.
Please Read Disclaimer