వెంకీసారు.. నీరజ మేడమ్!

0

వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వివాహం వినాయక్ రెడ్డితో రీసెంట్ గా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్ లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక సంగీత్ వేడుకలో సల్మాన్ ఖాన్ – వెంకటేష్ కలిసి చేసిన ‘ఝుమ్మే కి రాత్’ డ్యాన్స్ వీడియో సంగతి చెప్పనవసరమే లేదు.. ఎందుకంటే ఆ వీడియో వైరల్ అయింది.

ఇక రానా దగ్గుబాటి కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ కోసం వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. తాజాగా ఈ వేడుక నుంచి మరో ఫోటోకూడా బయటకు వచ్చింది. ఈ ఫోటోలో వెంకటేష్ – ఆయన సతీమణి నీరజ ఇద్దరూ వినాయక్ తరపు వారితో నిలబడి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ ఫోటోలో ప్రత్యేకత వెంకటేష్ సతీమణి నీరజగారే. ఎందుకంటే ఆవిడ మీడియా లైమ్ లైట్ కు చాలా దూరంగా ఉంటారు. కొద్దిరోజుల క్రితం వరకూ ఆమె ఫోటో ఎలా ఉంటుందనేది కూడా చాలామందికి తెలియదంటేనే ఆమె ఎంత లో-ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.

వెంకటేష్ అభిమానులకు ఈ ఫోటో ఎంతగానో నచ్చింది. నీరజ మేడమ్ ఎంతో హుందాగా ఉన్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. వెంకీ పక్కన నీరజ మేడమ్ భలే ఉన్నారని అంటున్నారు. రీసెంట్ గా ‘F2’ రిలీజ్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో వెంకీ మాట్లాడుతూ సహజంగా ఇంట్లో భార్య లేకపోతే భర్తలు రెచ్చిపోతుంటారని అంటూ ఉంటారు కానీ తన విషయంలో అది రివర్స్ అన్నాడు. మా ఆవిడ పక్కనుంటే చాలా ఆనందమని.. ఆమె పక్కనుంటే నేను రెచ్చిపోతానని వెంకీ తన సతీమణి గురించి చెప్పిన విషయం తెలిసిందే.
Please Read Disclaimer