మిస్ యు నాన్నా అంటూ వెంకీ ఎమోషన్!

0

తన కుమారుడు.. మనవలు కలిసి నటిస్తే చూడాలని ఆశించారు మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు. వెంకటేష్- రానా- నాగచైతన్య కలిసి నటించే మూవీలో తాను కూడా నటించాలని అనుకున్నారు. ఆ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించి అక్కినేని `మనం`లా సంచలనం సృష్టించాలని కలలు కనేవారు. కానీ ఆయన కోరిక నెరవేరక ముందే అనంత లోకాలకు వెళ్లారు. అయితే నాయుడు గారు ఇహలోకంలో లేకపోయినా తన కోరికను నెరవేర్చే ప్రయత్నం చేశారు వారసులు సురేష్ బాబు- వెంకటేష్.

అల్లుడు చైతన్యను .. వెంకీని కలిపి అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు `వెంకీ మామ` చిత్రం తీయడం వెనక ఎంతో సెంటిమెంట్ .. అంతకుమించిన ఫ్యామిలీ ఎమోషన్ దాగి ఉంది. అందుకే ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. రిలీజ్ విషయంలో.. ప్రమోషన్ విషయంలోనూ ఎంతో ఎమోషనల్ గా ఆలోచించారు సురేష్ బాబు అండ్ టీమ్. ఎట్టకేలకు డిసెంబర్ 13న వెంకీ బర్త్ డే కానుకగా సినిమా రిలీజైంది. దగ్గుబాటి – అక్కినేని అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మామా అల్లుళ్ల నటనకు ప్రశంసలు దక్కాయి.

దీంతో వెంకీ తన ఎమోషన్ ని దాచుకోలేకపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఉద్వేగంగా స్పందించారు. తండ్రిగారైన మూవీ మొఘల్ రామానాయుడును గుర్తు చేసుకున్నారు. నాయుడు గారితో తాను.. అల్లుడు చైతన్య కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. “ఇలాంటి రోజున మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం! మిస్ యూ నాన్న“ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి.. పైరసీని ప్రోత్సహించవద్దు! అని వెంకీ కోరారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత డా.డి.రామానాయుడు 19 ఫిబ్రవరి 2015న స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. వెంకీ మామ తరహాలోనే ఈసారి వెంకీ- రానా నటించే సినిమా కూడా ఉంటుందన్న సమాచారం ఉంది. ఇందులో చైతన్య నటించేందుకు స్కోప్ ఉంటుంది.
Please Read Disclaimer