మామ జరీ అంచు పంచె కడితే!

0

కొందరు పంచె కడితే ఆ పంచెకే అందం వస్తుంది. ఈ జాబితాలో ఏఎన్నార్- రజనీకాంత్-మోహన్ బాబు- నాగార్జున- సాయికుమార్- అజిత్ .. ఇలా కొన్ని పేర్లు ప్రముఖంగా చెప్పొచ్చు. ఈ హీరోలంతా పంచెకట్టుతో ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వెంకీమామ సీజన్. విక్టరీ వెంకటేష్ కు పంచెకట్టు కొత్తేమీ కాదు కానీ.. `వెంకీ మామ` కోసం అతడు కట్టిన పంచె కట్టు వెరీ స్పెషల్. జెరీ అంచు తెల్ల పంచె తీరు అభిమానులను కట్టి పడేస్తోంది. మామా నువ్వు కేక! అనే రేంజులోనే కుదిరింది ఈ పంచె కట్టు.

ఒకే ఒక్క ఫోటో లీక్ తోనే మామ కిరాక్ పుట్టించాడు. జెరీ అంచు తెల్ల పంచె.. ఆ పైన కాంబినేషన్ మెరూన్ కలర్ షర్ట్ తో వెంకీమామ అదరగొట్టాడు. ఆ నడక స్టైల్ అదిరింది. అసలే తెల్ల పంచెకట్టు .. దానికి కాంబినేషన్ షర్టు.. బ్లాక్ ఏవియేటర్ కళ్లద్దాలతో తుక్కు రేగ్గొట్టాడు. ఖరీదైన పడవలాంటి కార్ లో దిగి అలా మామ నడిచొస్తుంటే ఆ గాంభీర్యం .. స్టైల్ కట్టిపడేస్తోంది. విలేజీలో ఆచారాలు సాంప్రదాయం ఏమాత్రం మిస్ కాలేదు ఈ లుక్ లో. ఊళ్లో తీర్పులు చెప్పే పెద్దమనిషికి మారు రూపంలా కనిపిస్తున్నారు మామ. సింగిల్ లుక్ తోనే ఇంత ఇంప్రెషన్ పడిపోయింది. మరి అల్లుడు చైతో కలిసి మామ అచ్చిక బుచ్చిక ఎలా ఉండబోతోందో చూడాలి. ఈ చిత్రంలో రాశీ ఖన్నా టౌన్ నుంచి వచ్చే పోష్ గాళ్ పాత్రలో నటిస్తోంది. పాయల్ రాజ్ పుత్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

దసరాని టార్గెట్ చేస్తూ `వెంకీ మామ` అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఆ పండగకు తగ్గట్టే సినిమాలో కంటెంట్ అభిమానులకు ట్రీటివ్వబోతోందని అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని పోస్టర్లు అధికారికంగా రివీల్ కానున్నాయని తెలుస్తోంది. టీజర్ వస్తే కానీ పూర్తి క్లారిటీ మిస్సవుతోంది. బాబి- సురేష్ బాబు- వివేక్ కూచి భొట్ల అండ్ టీమ్ ఎప్పటికి రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.
Please Read Disclaimer