స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ‘C/O కంచరపాలెం’ డైరెక్టర్…?

0

యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా ఫస్ట్ సినిమా ”C/O కంచరపాలెం” తోనే ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలు ఎప్పుడూ వస్తుంటాయి.. ప్రేక్షకుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే సినిమాలు అప్పుడప్పుడూ మాత్రమే వస్తుంటాయి.. వాటిలో ‘కంచరపాలెం’ మూవీ ఒకటని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. అసలు యాక్టింగ్ అంటే ఏమిటో తెలియని వారికి నటన నేర్పించి కంచరపాలెం అనే ఊరి నేపథ్యంలో మానవ సంబంధాలకు దగ్గరగా కథను అల్లుకుని పెద్ద ప్రయోగమే చేసి సక్సెస్ బాట పట్టాడు వెంకటేష్ మహా. మహేష్ బాబు రాజమౌళి క్రిష్ సుకుమార్ లాంటి వారు సైతం డైరెక్టర్ వెంకటేష్ మహా ని మెచ్చుకున్నారు.

ప్రస్తుతం వెంకటేష్ మహా మలయాళ హిట్ చిత్రం ‘మహేషింతే ప్రతీకారం’ చిత్రానికి రీమేక్ గా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాకి దర్శకత్వం వహించాడు. ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకటేష్ మహా టాలీవుడ్ స్టార్ హీరోలు కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడట. అంతేకాకుండా చాలా మంది స్టార్ హీరోలకి స్టోరీని కొత్త రకమైన కథలని అర్థం చేసుకునే శక్తి లేదని.. చాలామందికి ‘ఆకలి అంటే ఏమిటో’ ‘ఆకలితో ఉండటం అంటే ఏమిటో’ తేడా తెలియదని కామెంట్స్ చేశారట. స్టార్ హీరోస్ న్యూ డైరెక్టర్స్ కి ఛాన్సెస్ ఇవ్వము అని నిజాయితీగా చెప్పకుండా సాకులు చెప్తారని విమర్శించాడట. నిజానికి టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు.

స్టార్ హీరోల్లో ఒకరైన కింగ్ నాగార్జున సైతం ఇప్పటికి ఎంతోమంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాతో మరో డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇక స్టార్ హీరోస్ ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా సినిమా అనేది కొన్ని కోట్లతో కూడుకున్న వ్యవహారం. ఒక హీరోని నమ్మి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే హీరోనే బ్లేమ్ చేస్తుంటాం. చాలా మంది స్టార్ హీరోలు ప్రయోగాలు చేసి బొక్కబోర్లా పడ్డ సందర్భాలు చాలానే చూసాం. ఇలాంటి నేపథ్యంలో స్టార్ హీరోస్ ఇమేజ్ ఫ్యాన్స్ ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానికి వారిని నిందించడానికి ఏమీ లేదు. మరి రెండు సినిమాల అనుభవంతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ పై వెంకటేష్ మహా అలాంటి కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Please Read Disclaimer