వైరల్ అవుతున్న వెంకీమామ పెళ్లి ఫోటో..

0

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కుటుంబాలను గోప్యంగా ఉంచే హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో ఒకరు విక్టరీ వెంకటేష్. ఆయన సతీమణి నీరజను పెళ్లి జరిగినప్పటి నుండి ఇంతవరకు బయటికి పెద్దగా తీసుకురాలేదు. వెంకటేష్ సినిమా వేడుకల్లో కూడా ఆమె ఎక్కువగా కనిపించదు. అప్పుడప్పుడూ ఫ్యామిలీ వేడుకల్లో మాత్రమే కనిపిస్తుంటారు నీరజ దగ్గుబాటి. వెంకీ పిల్లలు కూడా బయట ఎక్కువగా కనిపించరు. ప్రైవేట్ లైఫ్ అంటేనే వాళ్లకు ఇష్టమట. అందుకే వెంకీ వాళ్ల ఫ్యామిలీలో ఎవరిని కూడా ఇంతవరకు పబ్లిక్ లోకి తీసుకురాలేదు. సెలబ్రిటీ హోదా ఉన్నా కూడా ప్రైవేట్ లైఫ్లోనే వాళ్లు కంఫర్టుగా ఉంటారట. తాజాగా విక్టరీ వెంకటేష్ ఆయన భార్య నీరజల పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ నడుస్తున్న కారణంగా సోషల్ మీడియాలో పాత ఫోటోలను వెతికి మరీ వాటిని వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఆ విధంగానే వెంకటేష్ పెళ్లి ఫోటో కూడా అభిమానుల చేతికి చిక్కింది. ఇంకేముంది.. 1985లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత నీరజను పెళ్లి చేసుకున్నాడు వెంకటేష్. అప్పట్లో చాలా సన్నగా ఉండేవాడు. ప్రస్తుతం వారిద్దరి పెళ్లి ఫోటోను చూసుకుని నెటిజన్లు అభిమానులు మురిసిపోతున్నారు. పెళ్లైన మరుసటి ఏడాదే వెంకటేష్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరో వెంకటేషే. మొన్నటికి మొన్న వెంకీమామ ఎఫ్ 2 లాంటి సినిమాలతో విజయాలు అందుకున్న వెంకటేష్. ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.
Please Read Disclaimer