వెటరన్ హీరోలకు వారసుల టెన్షన్

0

వెటరన్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి .. కింగ్ నాగార్జున వారసులు సినీహీరోలుగా టాలీవుడ్ లో కెరీర్ సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నటసింహా నందమూరి బాలకృష్ణ.. విక్టరీ వెంకటేష్ వారసుల సంగతేమిటి? వెటరన్స్ లో ఆ ఇద్దరి వారసులు ఇంతవరకూ బరిలో దిగకపోవడానికి కారణమేమిటి? అంటే.. డీప్ గా వివరాల్లోకి వెళ్లాల్సిందే.

గత కొంతకాలంగా నటసింహా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవలే మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు అంతర్జాలంలోకి లీకవ్వడంతో అతడు సినీఎంట్రీ ఇవ్వడం లేదని.. అందుకే హీరోయిక్ లుక్ కనిపించడం లేదని నందమూరి అభిమానుల్లో సీరియస్ గా ప్రచారం సాగింది. మోక్షజ్ఞ నటించేందుకు ఆసక్తిగా లేడని పరిశ్రమ వర్గాలు సహా అభిమానుల్లో విస్త్రతంగా చర్చ సాగింది.

మరో వెటరన్ విక్టరీ వెంకటేష్ వారసుడు అర్జున్ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు సినీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా లేదా? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అయితే అర్జున్ లో ఇప్పటికి ఇంకా డైలమా కొనసాగుతోందట. హీరో అవ్వాలా వద్దా? అన్న డైలమా ఉంది. ఇప్పటికి ఆసక్తి లేదని కూడా తెలుస్తోంది. అయితే కెరీర్ గురించి సీరియస్ గా ఆలోచించే క్రమంలో డాడ్ లానే హీరో అవ్వాలా లేదూ ఇతర రంగాల్లో కెరీర్ సాగించాలా? అన్నది తేలనుంది. అర్జున్ ఏం కావాలనుకున్నా అందుకు తనవంతు సహకారం ఉంటుందని వెంకీ చెబుతున్నారు. అయితే బాలకృష్ణ- వెంకటేష్ పరిశ్రమలో అగ్ర హీరోలు. దశాబ్ధాల పాటు గొప్ప ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోలు కావడంతో సహజంగానే ఆ ఇద్దరి వారసుల రంగ ప్రవేశంపై అభిమానుల్లో అంచనాలుంటాయి. ఆ ఇద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఒత్తిడి తీవ్రంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. దగ్గుబాటి.. నందమూరి కాంపౌండ్ ల నుంచి వారసుల రంగ ప్రవేశంపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో రకరకాల సందిగ్ధతలు నెలకొన్నాయి.
Please Read Disclaimer