రాజు గారి గది ప్రాంఛైజీ లో వెంకటేష్ కన్ఫర్మ్

0

‘రాజు గారి గది’ తో దర్శకుడిగా సక్సెస్ అందుకొని నిర్మాతగా కూడా లాభాలు అందుకున్న ఓంకార్ ఆ తర్వాత నాగార్జున సమంత లతో ‘రాజు గారి గది 2’ తీసి బోల్తా కొట్టాడు. మొదటి షోకే సినిమా ఫ్లాప్ టాక్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ‘రాజు గారి గది 3’ తో దర్శకుడిగా తన లక్ చేసుకోవాలని చూస్తున్న ఓంకార్ మీడియాతో మాట్లాడి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

‘రాజు గారి గది’ తర్వాత వెంకటేష్ గారితో ‘రాజు గారి గది 2’ ప్లాన్ చేశానని కానీ కుదరక పోవడంతో నాగార్జున గారితో సినిమా చేశానని చెప్పుకున్నాడు. ఇక వెంకటేష్ గారితో ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఆయనతో ‘రాజు గారి గది’ ఫ్రాంచైజీ చేస్తానని అదెప్పుడనేది త్వరలోనే తెలుస్తుందని అన్నాడు.

ఇక ‘రాజు గారి గది 3’ తమిళ సినిమాకు రీమేక్ అనే విషయం పై కూడా క్లారిటీ ఇచ్చాడు ఓంకార్. ‘దిల్లుకు దుడ్డు 2’ నుండి సోల్ తీసుకొని కథ రాసుకున్నానని తెలిపాడు. ‘రాజు గారి గది 2’ ను ప్రేతమ్ కు రీమేక్ గా తెరకెక్కించి ఫ్లాప్ అందుకున్న ఓంకార్ ఇప్పుడు ఈ రీమేక్ తో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
Please Read Disclaimer