మరో రీమేక్ సినిమాను వెంకీమామ ఓకే చేశాడా..?

0

మలయాళ సినీ స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా 2019 డిసెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం “డ్రైవింగ్ లైసెన్స్”. లాల్ జూనియర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. మియా జార్జ్ దీప్తి సాటి హీరోయిన్లుగా రూపొందిన ఈ కామెడీ సినిమా హిట్ అవ్వడం తో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీల కళ్ళు ఆ సినిమాపై పడ్డాయి. ఈ సినిమాను తెలుగులోకి అనువదించడానికి ప్రత్నిస్తున్నారట తెలుగు దర్శక నిర్మాతలు.

ఒక హీరో తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకొనే ప్రాసెస్ లో జరిగే కథాంశం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం మెగాస్టార్ చిరు రాంచరణ్ లను అనుకుంటున్నారట. వీరిద్దరూ కుదరకపోతే నానిని లైన్ లో పెడతారని సమాచారం.

ప్రస్తుతం తమిళ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ రీమేక్ లో నటిస్తున్న విక్టరీ వెంకటేష్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఓకే అయితే.. రెండు ఇతర బాషా చిత్రాలే కావడం విశేషం. చూడాలి మరి టాలీవుడ్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ సినిమా గురించి ఎలాంటి న్యూస్ వినిపించనుందో..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-