చిరుకు ముద్దు పెట్టిన వెంకీ

0

టాలీవుడ్లో స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధాలు చేసేస్తుంటారు కానీ.. ఆ హీరోలు మాత్రం చాాలా వరకు సన్నిహితంగానే మెలుగుతారు. ముఖ్యంగా టాలీవుడ్లో సీనియర్ హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మెగా నందమూరి అభిమానులు శత్రువుల్లా మెలుగుతారు కానీ.. చిరంజీవి బాలకృష్ణ సైతం ఎఫ్పుడైనా కలిస్తే చాలా స్నేహంగానే కనిపిస్తారు.

అందులోనూ చిరు అసలేమాత్రం బేషజం లేకుండా అందరితో కలిసిపోతాడు. ఆయనకు నాగార్జున వెంకటేష్లతో అయితే బాగా సాన్నిహిత్యం ఉంది. చిరు నాగ్ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే కానీ.. చిరు వెంకీ బయట కలిసి కనిపించడం తక్కువ. అయితే చిరు కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ చూశాక వెంకీ ఎంత ఉద్వేగానికి గురై చిరు మీద తన ప్రేమను ఎలా చూపించాడో తాజాగా వెల్లడైంది.

స్వయంగా చిరునే ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘సైరా’ విడుదల తర్వాత వెంకీ చిరుకు ఫోన్ చేశాడట. ఎక్కడున్నావు అని అడిగాడట. ఏంటి విషయం చెప్పు అంటే.. ఫోన్లో మాట్లాడలేను నిన్ను కలవాలి అని చెప్పాడట.

అప్పుడు చిరు ఇంట్లో లేకపోయినా.. వెంకీ కోసం ఇంటికి వస్తా అని చెప్పాడట. పది నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాడట. తర్వాత వెంకీ అక్కడికి వచ్చి.. నేరుగా చిరును గట్టిగా వాటేసుకున్నాడట. అలాగే ముద్దు కూడా పెట్టేశాడట. ‘సైరా’ సినిమాలో ఏం చేశావ్ ఏం చేశావ్ అంటూ తనదైన శైలిలో ఆనందాన్ని పంచుకున్నాడట. ఈ విషయాన్ని చిరు చాలా ఉద్వేగంతో మీడియా వాళ్ల దగ్గర పంచుకున్నాడు. ‘సైరా’ చూసిన తన తోటి హీరోలు ఇలా ఏమాత్రం ఇగో లేకుండా తనను ప్రశంసించడం చాలా ఆనందం కలిగించిందని చిరు చెప్పుకొచ్చాడు.
Please Read Disclaimer