వెంకీ – కళ్యాణ్ రామ్ వచ్చేదెప్పుడంటే ?

0

సంక్రాంతికి వస్తున్నామంటూ మొన్నటి వరకూ చెపుకొచ్చిన మహేష్ బాబు అల్లు అర్జున్ నిన్న జనవరి 12 న థియేటర్స్ లోకి రాబోతున్నామంటూ ప్రకటించారు. అంతే ఒకే రోజు రెండు బడా సినిమాలు రిలీజ్ అనే సరికి హాట్ టాపిక్ అయింది. అయితే అంత వరకూ బాగానే ఉంది. అదే సమయంలో కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘ఎంత మంచి వాడవురా’ కూడా పన్నెండున విడుదల అంటూ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇక ఆ పోస్టర్ ఫ్యాన్ ఫ్యాన్ మేడ్ అని తెలియక అందరూ వచ్చే సంక్రాంతికి ఒకే రోజు మూడు సినిమలంటూ చర్చ లేపారు. ఇక ఆ మూడు సినిమాలతో పాటు వెంకీ మామ కూడా సంక్రాంతికే అంటూ ఓ వార్త బయలుదేరింది. ఇంకా మేకర్స్ నుండి క్లారిటీ రాకుండానే సంక్రాంతికి నాలుగు సినిమలంటూ మూవీ లవర్స్ ఖుషీ అయ్యారు.

నిజానికి ‘ఎంత మంచి వాడవురా’ ను సంక్రాంతి రోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది కాకపోతే జనవరి 14న విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ‘వెంకీ మామ’కు సంబంధించి డిసెంబర్ లేదా జనవరి రిలీజ్ అనుకుంటున్నారు. ఇంకా డిస్కర్షన్స్ నడుస్తున్నాయి. సో ఇలా రెండు సినిమాలకు సంబంధించి అఫీషియల్ రిలీజ్ డేట్ రాగానే మరో రెండో సినిమాలకు సంబంధించి అభిమానులు ఇలా రిలీజ్ డేట్ తో సోషల్ మీడియా లో పోస్టులేశారు.
Please Read Disclaimer