వెంకీమామకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారోచ్

0

విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న ‘వెంకీమామ’ డిసెంబర్ 13 న విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. రిలీజుకు వారం రోజుల సమయమే ఉండడంతో ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. టీజర్.. లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సినిమాను చూసిన సెన్సార్ వారు ‘వెంకీమామ’ కు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి కాబట్టి ‘వెంకీమామ’ టీమ్ ఇకపై ప్రమోషన్స్ పై పూర్తిస్థాయిలో దృష్టిపెడతారని అంటున్నారు. ఈ సినిమాలో వెంకీ.. చైతులు నిజ జీవితంలాగా మామ అల్లుళ్ళ పాత్రలు పోషిస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. చైతు సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్.. సంపత్ రాజ్.. రావు రమేష్.. పోసాని కృష్ణమురళి.. బ్రహ్మాజి.. శ్రీనివాసరెడ్డి ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీ. సురేష్ బాబు టీ.జీ.విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer