న్యూ లుక్: మామ అల్లుళ్లు సీరియస్

0

విక్టరీ వెంకటేష్- నాగచైతన్య.. మామ అల్లుళ్లు అన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో విజువల్ ట్రీట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు కోసం దగ్గుబాటి ఫ్యాన్స్..అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డి.సురేష్ బాబు తో కలిసి పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న `వెంకీమామ` ఫ్యాన్స్ దాహం తీరుస్తుందనే అంచనా వేస్తున్నారు. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వెంకీ మామ నుంచి రకరకాల స్టిల్స్ రిలీజై ఆకట్టుకున్నాయి. వినాయక చవితి- దసరా పోస్టర్లు అభిమానుల్ని మైమరిపించాయి.

తాజాగా దీపావళి కానుకగా శుభాకాంక్షలు చెబుతూ.. మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో మామ- అల్లుళ్లు ఇద్దరూ కాస్తంత సీరియస్ లుక్ తోనే కనిపిస్తున్నారు. ప్లెజెంట్ గా ఉండే విలేజ్ లో ఆ ఇద్దరూ చేసే హంగామా వేరు. బార్డర్ కి వెళ్లిన అల్లుడు చేసే పోరాటం వేరు. సన్నివేశం చూస్తుంటే ఆ రెండో దాంట్లో ఏదో ఎమోషన్ సీరియస్ గానే కనిపిస్తోంది. చైతూ పూర్తిగా ఆర్మీ అధికారి గెటప్ తో దిగిపోయాడు. పక్కనే వెంకీ మామ అంతే సీరియస్ గా కనిపిస్తున్నాడు. బార్డర్ అప్పియరెన్స్ కి తగ్గట్టే పోస్టర్ లో పరిశీలనగా చూస్తే దూరంగా మంచు కొండలు .. అక్కడ ఆర్మీ హెలీకాఫ్టర్ వగైరా వగైరా కనిపిస్తున్నాయి. పోస్టర్ లో మూవీ మొఘల్ రామానాయుడు రూపాన్ని తిరిగి వీక్షించే ఫెసిలిటీ ఉంది.

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్ లైఫ్ లోనూ గొప్ప ట్రీట్ కి రెడీ అయిపోయారని తాజా పోస్టర్ చెబుతోంది. దగ్గుబాటి మామ అక్కినేని అల్లుడు జీవితాల్లో ఎమోషన్ ఏ విధంగా ఆవిష్కరించనున్నారు? అన్నది చూడాలి. ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. `జై లవకుశ` తర్వాత ఎంతో శ్రద్ధ పెట్టి చేస్తున్న సినిమా ఇది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.
Please Read Disclaimer