2019 సంక్రాంతిని రిపీట్ చేద్దామనా?

0

ఇప్పటికే 2020 సంక్రాంతి పుంజులేవో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సూపర్ స్టార్ రజనీకాంత్ .. కళ్యాణ్ రామ్ .. ఇంకా పలువురు సంక్రాంతి రేసులో ఉన్నారు. అయితే వీళ్లందరితో పాటుగా మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్ – నాగచైతన్య బరిలోకి దిగబోతున్నారన్న ప్రచారం ఆశ్చర్యపరుస్తోంది. భారీ కాంపిటీషన్ కి వెరవక మామా అల్లుళ్లు హుషారు చూపిస్తున్నారట.

దగ్గుబాటి వెంకటేష్-యంగ్ హీరో మామా అల్లుళ్లుగా నటిస్తున్న `వెంకీ మామ` కోసం ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ – అటు అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. `ప్రేమమ్` తర్వాత .. మరోసారి ఆ ఇద్దరూ కలిసి తెరపై కనిపించబోతున్నారు. ఈసారి పూర్తి స్థాయి పాత్రలతో ట్రీటివ్వబోతున్నారు. అందుకే ఈ సినిమాపైనా ఫ్యాన్స్ లో భారీ అంచనాలేర్పడ్డాయి. అయితే వెంకీ మామ రిలీజ్ తేదీపై ఇన్నాళ్లు డైలమా కొనసాగింది. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజవుతుందని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. వెంకీ మామ 2020 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

ఇదివరకూ రిలీజ్ చేసిన టీజర్ గ్లింప్స్ మెప్పించింది. విలేజ్ నేపథ్యం మిలటరీ నేపథ్యం రక్తి కట్టిస్తాయన్న అంచనా పెరిగింది. ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. డి.సురేష్ బాబుతో కలిసి పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. అందరికీ మాంచి బ్లాక్ బస్టర్ అవసరం ఉంది. మరి అలాంటప్పుడు సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురంలో-దర్బార్ లాంటి భారీ చిత్రాలతో పోటీపడి ఈ సినిమా ఏమేరకు నెగ్గుకొస్తుందోనన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. 2019 సంక్రాంతి బరిలో వెంకీ-వరుణ్ కాంబో నటించిన ఎఫ్ 2 సైలెంట్ కిల్లర్ లా ఇతర భారీ చిత్రాల్ని వెనక్కి నెట్టి బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే తరహాలో మరోసారి అలాంటి సీన్ రిపీటవుతుందని ధీమా ఏదైనా ఉందేమో చూడాలి.
Please Read Disclaimer