డైలమాలో వెంకీ మామ ?

0

విక్టరీ వెంకటేష్ – నాగ చైతన్య ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ కాంబినేషన్ లో రూపొందుతున్న వెంకీ మామ షూటింగ్ ప్రస్తుతం హోల్డ్ లో పెట్టినట్టుగా సమాచారం. వెంకటేష్ కు ఏదో చిన్న గాయం కలగడంతో డాక్టర్లు రెస్ట్ రికమండ్ చేశారని అందుకే కొంత బ్రేక్ ఇవ్వక తప్పలేదని ఇన్ సైడ్ టాక్. యూనిట్ మాత్రం ఈ గ్యాప్ కొంతేనని అనుకున్న ప్లానింగ్ లో చిన్న మార్పులు తప్ప దసరా రిలీజ్ కు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వొచ్చని అంటున్నారు.

దీని సంగతి అలా ఉంచితే నిర్మాత సురేష్ బాబు మనసులో ఉన్న డేట్ అక్టోబర్ 4 అని తెలిసింది. ఆ మేరకు కొద్దిరోజుల క్రితమే లీకులు కూడా వచ్చాయి. సైరా అక్టోబర్ 2న వస్తుందా రాదా అనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఒకవేళ అది డ్రాప్ అయితే వెంకీ మామను దింపి లాభపడాలన్న సురేష్ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ సైరా మేకర్స్ గాంధీ జయంతిని పక్కాగా లాక్ చేసుకున్నారు. ఇక ఎలాంటి అనుమానాలు లేనట్టే

కాబట్టి ఇప్పుడు వెంకీ మామ 4న రావడం అంత సేఫ్ గేమ్ అనిపించుకోదు. అందులోనూ సైరా మాములు కమర్షియల్ సినిమా కాదు. బాహుబలిని టార్గెట్ చేసింది. టాక్ యావరేజ్ గా వచ్చినా చాలు చిరు ప్రత్యర్థి సినిమాలను వాష్ అవుట్ చేస్తాడు. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా ఇక కంట్రోల్ చేయడం కష్టమే.

అందుకే వెంకీ మామను సైరాకు పోటీగా దింపితే వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన సురేష్ బాబు డేట్ ని మార్చే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు వినికిడి. వెంకటేష్ గాయం పెద్దదే అయితే ఇది జరిగేది కానీ త్వరలో షూటింగ్ కి వస్తాడు అంటున్నారు కనక అనుకున్న టైంకి ఫినిష్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే సైరాతో పోటీ గురించి ఆలోచించుకుని విడుదల తేదీ గురించి క్లారిటీ ఇస్తే వెంకీ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారు.
Please Read Disclaimer