వెంకీమామ అల్లుడు టీజర్

0

రియల్ లైఫ్ మామ-అల్లుడిని కలిపి వెండితెరపైనా మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మామ అల్లుళ్లు అయిన.. విక్టరీ వెంకటేష్- నాగచైతన్యలను కలిపి బాబి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ – డి.సురేష్ బాబు బృందం ఈ తరహా ప్రయత్నం చేస్తున్నారు. `వెంకీమామ` అనేది టైటిల్. ఇందులో అల్లుడుగా నాగచైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. మామ వెంకటేష్ తో చైతూ కెమిస్ట్రీ అద్భుతంగా సింకైందని ఇప్పటికే రిలీజైన పోస్టర్లు.. టీజర్ చెబుతున్నాయి. చైతూ బర్త్ డే సందర్భంగా తాజాగా రిలీజైన కొత్త టీజర్ అటు దగ్గుబాటి ఫ్యాన్స్ కి ఇటు అక్కినేని ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటిస్తోంది.

ఇప్పటికే ఈ టీజర్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ వీడియో అక్కినేని అభిమానుల్లో వైరల్ గా దూసుకెలుతోంది. ఇందులో అల్లుడు చైతన్యలోని రెండు విభిన్నమైన కోణాల్ని ఎలివేట్ చేసారు. ఓవైపు మామతో కలిసి ఎంతో సరదాగా చిలౌట్ చేస్తూ.. మరోవైపు కశ్మీర్ బార్డ్ లో సీరియస్ గా టెర్రరిజంపై ఆపరేషన్ చేస్తున్న తీరు చూస్తుంటే చైతూ ట్రీట్ మామూలుగా ఉండదని అర్థమైంది. తీవ్రవాదుల్ని మట్టుబెట్టే స్పెషల్ బెటాలియన్ లో డేరింగ్ సైనికుడిగా చైతూ దూసుకెళుతున్న తీరు ఆకట్టుకుంది. ఆర్మీ గెటప్ లో అతడు సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాడు.

డిసెంబర్ 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి అంతకంతకు వెంకీమామ ప్రమోషన్ ని హీటెక్కిస్తోంది చిత్రబృందం. వెంకీ – నాగచైతన్య కెరీర్ బెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకోనుంది అన్నది చూడాలి.
Please Read Disclaimer