వెంకీమామ టీజర్ టాక్

0

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న క్రేజీ మల్టిస్టారర్ చిత్రాలలో ‘వెంకీమామ’ ఒకటి. విక్టరీ వెంకటేష్.. ఆయన మేనల్లుడు నాగచైతన్య కలిసి నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు దర్శకుడు కె యస్ రవీంద్ర(బాబీ). విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఒక నిముషంలోపే ఉన్న ఈ ఫస్ట్ గ్లింప్స్ లో మామ అల్లుళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో చూపించారు.

టీజర్ ఆరంభంలో అల్లుడు చైతుతో పచ్చని పొలాల మధ్యలో ఉన్న దారిలో బైక్ పై కబుర్లు చెప్తూ వెళ్తుంటాడు వెంకీ. కబుర్లతో మాత్రమే సరిపెట్టే మామ కాదు.. పాతకాలం వ్యాయామశాలలో అల్లుడితో కఠినమైన కసరత్తులు కూడా చేయిస్తుంటాడు. ఇలా అన్ని విషయాల్లో గురువులా ట్రైనింగ్ ఇచ్చిన సంగతిని నెక్స్ ఫైట్ సీన్ లోనే స్వయంగా గర్వంగా చెప్పుకుంటాడు. “బరిలో ఆట నేర్పా.. గోదారిలో ఈత నేర్పా.. ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు” అంటూ జాతరలో ఒక మాసు ఫైటుకు ఇద్దరూ రెడీ అవుతారు. అన్నీ మామే నేర్పిస్తే ఇక అక్కినేని అల్లుడుగారు ఏం చేస్తారు? ఆయనకు వారసత్వంగా వచ్చిన రొమాన్స్ ను ఈ దగ్గుబాటి మామకు నేర్పిస్తారు! అయితే ఈ అల్లుడు ఆ విషయం చెప్పుకోడు. వెంకీనే చైతు వద్దకు వచ్చి “నేను ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ అని ప్రాక్టిస్ చేస్తూ ఉంటే.. నాదగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అనింది అల్లుడూ” అంటూ డైలాగ్ సగంలో ఎగ్జైట్ అయిపోయి చైతును హత్తుకుంటాడు.

టీజర్ లో వెంకీ చైతుల కెమిస్ట్రీ సూపర్ గా ఉంది. ఇక హీరోయిన్లు రాశి ఖన్నా.. పాయల్ రాజ్ పుత్.. ఇతర కమెడియన్లు కూడా తోడైతే ఈ మామ అల్లుడు కలిసి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఆలస్యం ఎందుకు ఈ క్రేజీ వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ ను చూసేయండి.
Please Read Disclaimer