బాలయ్య.. తేజు సినిమాలకు వెంకీమామ టెన్షన్!

0

సీనియర్ స్టార్ వెంకటేష్.. ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టిస్టారర్ చిత్రం ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ విషయంలో చాలారోజులుగా సందిగ్ధత నెలకొని ఉంది. అయితే ఫైనల్ గా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిందని.. డిసెంబర్ 13 వ తేదీన ‘వెంకీమామ’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ తో డిసెంబర్ 20-25 సీజన్ లో రిలీజ్ కానున్న సినిమాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

‘వెంకీమామ’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్.. పైగా వెంకీ-చైతులు కలిసి నటిస్తున్న చిత్రం. హీరోలిద్దరికీ ఇద్దరికీ కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రెండు వారాల పాటు థియేట్రికల్ రన్ ఉంటుంది. దీంతో డిసెంబర్ 20 రిలీజ్ అవుతున్న ‘రూలర్’.. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలకు ఇబ్బందే. ‘వెంకీమామ’ కనుక సక్సెస్ అయితే బాలయ్య.. తేజు సినిమాలకు థియేటర్ల సంఖ్యలో కోత తప్పదు.

నిజానికి ఇలాంటి పెద్ద రేంజ్ ఉండే సినిమాల విడుదల తేదీ కనీసం నెల ముందు అయినా ప్రకటిస్తే ఇతర ఫిలిం మేకర్లు వారి సౌలభ్యాన్ని బట్టి తమ సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటారు. అలా కాకుండా వారం ముందు. పది రోజుల ముందు ప్రకటిస్తే ఇతర సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు. మరి డిసెంబర్ 20 న రిలీజ్ కానున్న సినిమాలు ఈ ‘వెంకీమామ’ సునామీని ఎలా నిలువరించగలవో వేచి చూడాలి.
Please Read Disclaimer