రాజశేఖర్ పెద్ద కూతురు ‘వెన్నెల’ ఫస్ట్ లుక్ విడుదల…!

0

రాజశేఖర్ – జీవితల ఇద్దరు కూతుర్లు శివాని మరియు శివాత్మిక రాజశేఖర్ లు సినీ ఇండస్ట్రీలో అడుగులు పెట్టేసారు. ఇప్పటికే చిన్నమ్మాయి శివాత్మిక ‘దొరసాని’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రశంసలు దక్కించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు శివాని రాజశేఖర్ కూడా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది. కే. మల్లిఖార్జున్ రామ్ దర్శకత్వంలో మహాతేజా క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిగినల్స్ కలిసి నిర్మిస్తున్న ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తోంది. నేడు శివాని రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలో శివాని ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సినిమాలో శివాని ‘వెన్నెల’ అనే పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్ లో శివాని చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంతో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్నాడు. తేజా గతేడాది సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తేజ సజ్జ – శివాని హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ‘అద్భుతం’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇదొక సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందనున్న లవ్ స్టోరీ అని సమాచారం. ఇక శివాని విషయానికొస్తే డాన్స్ మరియు మార్షల్ ఆర్ట్స్ లో మెలుకువలు నేర్చుకుంటూనే మెడిసిన్ కూడా చదివింది. రాజశేఖర్ – జీవిత దంపతుల పెద్ద కుమార్తె అయిన శివానికి ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయని ఇప్పటికే అనుకుంటున్నారు. తన అందం ఆకర్షణీయనమైన పర్సనాలిటీతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న శివాని సినీ ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టాల్సింది. హిందీలో సూపర్ హిట్ అయిన ‘2 స్టేట్స్’ సినిమాని తెలుగులో అడవి శేష్ – శివాని లను హీరోహీరోయిన్స్ గా పెట్టి రీమేక్ చేయాలని భావించారు. కొన్ని షెడ్యూల్స్ కూడా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వలన నిలిపివేయబడింది. దీంతో మహాతేజా క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిగినల్స్ లో రాబోయే మొదటి సినిమాతో శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
Please Read Disclaimer