ఆ డైరెక్టర్ టాయ్ లెట్ కి కూడా బ్రేకివ్వరా?

0

రొటీన్ గా వెళితే ఈరోజుల్లో ఎవరు చూస్తారు. ఏదైనా కొత్తగా చూపిస్తేనే. రామ్ గోపాల్ వర్మలా యూనిక్ గా ఆలోచించాలి. లేదంటే ప్రమోషన్ ఎంత చేసినా జనం అంతగా కనెక్టవ్వరు. చాలా కాలం క్రితం ఆర్జీవీ తలబిరుసు వ్యవహారం చూసి అతడికి మీడియా మొత్తం వ్యతిరేకంగా మారిపోతే .. అతడు ఏకంగా ఆ సినిమా పోస్టర్లను బస్సులు కార్లు చివరికి ఆటోలపైనా ముద్రించి ప్రమోషన్ చేసుకున్నారు. బుర్ర క్రియేటివ్ గా ఆలోచిస్తే ఏమైనా చేయొచ్చని నిరూపించారు ఆర్జీవీ.

ఆ తర్వాత కేవలం కాంట్రవర్శీలతోనే బండి లాగించేస్తూ క్రియేటివిటీ చూపిస్తున్నారు. వివాదాలతో ప్రచారం ఆర్జీవీని ఎక్కడికో తీసుకెళుతోంది. ఉచిత పబ్లిసిటీ ఎలానో ఆర్జీవీని చూసి నేర్చుకోవాలి అన్నంతగా వెలుగుతున్నారు. అదంతా సరే కానీ.. రొటీన్ గా ప్రచారం చేస్తే మజా ఏం ఉంటుంది? అనుకున్నాడో ఏమో.. ఇటీవలి కాలంలో అనీల్ రావిపూడి యూనిక్ ప్రమోషన్ స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. ఆయన ఆన్ లొకేషన్ ఖాళీ సమయాల్ని తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. అక్కడ అందుబాటులో ఉన్న ఆర్టిస్టులతో తెలివిగా స్కిట్లు చేయించి సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ప్రమోషన్ చేయిస్తున్నారు.

ఇంతకుముందు సరిలేరు కథ అప్పుడే చెప్పేస్తారా! అంటూ సుబ్బరాజు అండ్ టీమ్ తో అదిరిపోయే స్కిట్ చేయించారు. అది బాగానే పేలింది. ప్రమోషన్ కి కలిసొచ్చింది. జస్ట్ నాలుగైదు నిమిషాల సమయం దొరికితే చాలు దానిని రావిపూడి తెలివిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలానే టాయ్ లెట్ కి కూడా వదలరా? `అడిగినా బ్రేకివ్వరు` అంటూ అదిరిపోయే స్కిట్ చేశారు. సుబ్బరాజు – వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో ఈ స్కిట్ కడుపుబ్బా నవ్విస్తోంది. వెన్నెల కిషోర్ రెస్ట్ రూమ్ కి వెళుతుంటే దర్శకుడు అనీల్ రావిపూడి ఆయన్ని ఎక్కడికి? అంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి రిలీజ్ అంటూ సుబ్బరాజు గుర్తు చేస్తున్నారు.. టైమ్ దగ్గర పడుతుంటే టాయ్ లెట్ కి కూడా బ్రేకివ్వరు! అంటూ ఫన్ అదిరింది. ఈ వీడియోని వెన్నెల కిషోర్ స్వయంగా అభిమానులకు షేర్ చేశారు. ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ప్రతి సోమవారం మాస్ ఎంబీ సాంగ్ ట్రీట్ కి రెడీ కండి అని చెప్పారు. ఈ సోమవారం నుంచే దేవీశ్రీ మాస్ ట్రీట్ మొదలు.. జస్ట్ వెయిట్..
Please Read Disclaimer