బన్నీ19 లో టబు ఎంట్రీ – వీడియో

0

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ క్రేజీ మూవీలో చాలా స్పెషల్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందులో సీనియర్ హీరోయిన్ టబు ఒకరు. మొదటిసారిగా ఓ పాత్రను పరిచయం చేస్తూ ఈ యూనిట్ వదిలిన వీడియోలో టబుకు స్వాగతం చెబుతూ స్పెషల్ గా రిలీజ్ చేయడం విశేషం. పాత్ర పేరు తీరుతెన్నులు చెప్పలేదు కానీ గెటప్ ని బట్టి చూస్తే ఆవిడేదో రిచ్ క్లాస్ ఆంటీ పాత్ర పోషించినట్టు కనిపిస్తోంది.

బన్నీకో పూజా హెగ్డేకో అమ్మనో అత్తనో అయ్యుండొచ్చు. ఇంతకు ముందు త్రివిక్రమ్ చేసిన రెండు సినిమాల్లో నదియా తరహా బాడీ లాంగ్వేజే ఇందులోనూ కనిపిస్తోంది. సెట్ లో డైలాగ్ పేపర్ ని నిశితంగా చదివి ఆకళింపు చేసుకోవడం అందరితో కలివిడిగా నవ్వుతు మాట్లాడటం వీడియోలో ప్రధాన ఆకర్షణ. తెలుగులో వెంకటేష్ కూలీ నెంబర్ వన్ తో పాతికేళ్ల క్రితం టాలీవుడ్ కు పరిచయమైన టబు ఆ తర్వాత నిన్నే పెళ్ళడతా లాంటి ఇండస్ట్రీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

బాలీవుడ్ లో ఎక్కువ ఆఫర్స్ రావడంతో ఇక్కడ ఫోకస్ పెట్టలేకపోయిన టబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారక తెలుగులో ఆ మధ్య బాలకృష్ణ పాండురంగడులో కనిపించడం తప్ప ఇంకే సినిమాలు చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళి అల్లు అర్జున్ సినిమాలో దర్శనమివ్వబోతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం టబు కనిపించేది బన్నీ తల్లిగానట. ఇకపై ఒక్కో పాత్రను ఇలాగే పరిచయం చేసే ప్లాన్ లో ఉంది యూనిట్. ఏమాట కామాటే టబులో ఇంత వయసు వచ్చినా గ్లోలో కానీ గ్లామర్ లో కానీ పెద్దగా మార్పు లేకపోవడం విశేషమే
Please Read Disclaimer