తేజ వెబ్ సిరీస్ వార్తలు సగం నిజం సగం అబద్దం

0

ప్రముఖ దర్శకుడు తేజ ఒక వైపు అలివేలుమంగ వెంకటరమణ చిత్రంకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కించే పనిలో ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో తేజ వెబ్ సిరీస్ లేదా వెబ్ మూవీ ప్రసారం కాబోతుందని షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అమెజాన్ వారు భారీ పెట్టుబడి పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తేజ వెబ్ సిరీస్ వార్తల్లో సగం నిజం ఉందని అలాగే ఆ వార్తల్లో సగం అబద్దం కూడా ఉందని అంటున్నారు.

దర్శకుడు తేజ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం నిజమే. కాని అది అమెజాన్ కోసం తెరకెక్కిస్తున్న విషయం మాత్రం అబద్దం. ఇప్పటి వరకు తేజ తన వెబ్ సిరీస్ ను ఏ ఒక్క ఓటీటీకి ఇవ్వలేదంటున్నారు. ఎవరు ఎక్కువ మొత్తంను కోట్ చేస్తే వారికి వెబ్ సిరీస్ రైట్స్ ను ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. వెబ్ సిరీస్ కు సంబంధించి ఒక ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి అయ్యింది. దాని ఎడిటింగ్ కూడా పూర్తి చేశారట. ఔట్ పుట్ విషయంలో చాలా సంతృప్తికరంగా ఉండటంతో తదుపరి ఎపిసోడ్స్ చిత్రీకరణ చేయాలనుకుంటూ ఉండగా తేజ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.

ఈ నెల చివరి నుండి షూటింగ్ ను మళ్లీ మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. తేజ నుండి రాబోతున్న వెబ్ సిరీస్ కు “Ssshhhtories” అనే టైటిల్ ను ఖరారు చేశారట. ఈ టైటిల్ ను చూస్తుంటేనే ఇదో బోల్డ్ కంటెంట్ అని క్లీయర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం ఓటీటీలో బోల్డ్ కంటెంట్ కు మంచి క్రేజ్ ఉంది. కనుక ఈ బోల్డ్ కంటెంట్ ఖచ్చితంగా తేజకు మంచి లాభాలను తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.