రూల్స్ బ్రేక్ చేసిన హీరో సుశాంత్

0

అక్కినేని నటవారసుడు సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ‘నో పార్కింగ్’ అనే టాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శన్ అనే యువ దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి రవి శంకర్ శాస్త్రి హరీష్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన రైడ్ విత్ సుశాంత్ అనే ప్రత్యేక వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ వీడియోలో సుశాంత్ ఉద్దేశపూర్వకంగా తన సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను ఒక చిన్న వీధిలో పార్కింగ్ చేయడం ద్వారా నో పార్కింగ్ (ఇచ్చట వాహనములు నిలుపరాదు) సైన్ బోర్డు కనిపిస్తుంది. ముఖం మీద గాయాలతో పరుగెత్తుతున్న సుశాంత్ను ఎవరో వెంబడించడాన్ని ఈ వీడియోలో చూపించారు. ఇటీవల అల వైకుంఠపురంలో చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించిన సుశాంత్ తన తదుపరి చిత్రంగా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తో ముందుకొస్తున్నాడు. చిలసౌ సినిమా మినహా సుశాంత్ కు ఇప్పటి దాకా సరైన సోలో హిట్ లభించలేదనే చెప్పవచ్చు. ఈ చిత్రం ద్వారా అయినా మంచి విజయాన్ని సాధించి అగ్రకథానాయకుడిగా గుర్తింపు పొందాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-