సూపర్ స్టార్ ఫ్యామిలీ కమర్షియల్ యాడ్

0

టాలీవుడ్ హీరోలందరికంటే ఎక్కువ కమర్షియల్ యాడ్స్ చేసిన.. చేస్తున్న స్టార్ మహేష్ బాబు. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు ఆ కంపెనీల్లో భాగస్వామిగా కూడా మహేష్ బాబు మారినట్లుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా మహేష్ బాబు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈసారి సదరు సంస్థ కోసం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యాడ్ చేశాడు.

కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు ఫ్యామిలీ అంతా కలిసి ఒక కంపెనీ కోసం యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కొందరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నేడు మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ నటించిన సాయి సూర్య డెవలపర్స్ వారి యాడ్ వచ్చింది. మహేష్ బాబు.. నమ్రతలతో పాటు వారిద్దరి పిల్లలు గౌతమ్ సితారలు కూడా ఈ యాడ్ లో కనిపించడంతో యాడ్ ఫ్యాన్స్ కు కన్నుల విందుగా ఉంది. ఇలాంటి ఒక వీడియో కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.

గౌతమ్ పెద్ద వాడు అవ్వడంతో పాటు.. సితార కూడా చాలా క్యూట్ గా ఈ యాడ్ లో కనిపించింది. ఇక మహేష్ బాబు స్టైలిష్ మ్యాన్లీ లుక్ తో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చాలా కాలం తర్వాత నమ్రత ఒక కమర్షియల్ యాడ్ లో విత్ మేకప్ తో కనిపించడం జరిగింది. ఒకప్పటి హీరోయిన్ అయిన నమ్రత ఏమాత్రం ఆమె గ్లామర్ తగ్గలేదనిపిస్తుంది. మొత్తానికి ఈ యాడ్ సాయి సూర్య డెవలపర్స్ కు ఎంత హెల్ప్ అయ్యేనో కాని మహేష్ బాబు ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ హ్యాపీని తెచ్చింది.
Please Read Disclaimer