కాస్టింగ్ కౌచ్ బాధితుల్లో మరో స్టార్ హీరోయిన్

0

బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్ ఇలా అన్ని వుడ్ లకు చెందిన హీరోయిన్స్ మరియు నటిమనుల్లో ఎక్కువ శాతం తాము కెరీర్ ఆరంభంలో కాస్టింగ్ కౌచ్ అనుభవంను ఎదుర్కొన్నామని చాలా ఇబ్బందులు పడి ఈస్థాయికి వచ్చామంటూ చెప్పడం మనం చూశాం. బాలీవుడ్ లో కంగనా నుండి మొదలుకుని ఎంతో మంది హీరోయిన్స్ కు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది. పలువురు హీరోయిన్స్ గతంలో లైంగిక వేదింపులు ఎదుర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా విద్యాబాలన్ తాను ఎదుర్కొన్న ఒక చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా విద్యాబాలన్ మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం చెన్నైలో నేను ఉన్న సమయంలో ఒక దర్శకుడు నా వద్దకు వచ్చాడు. ఆయనతో కొద్ది సమయం మాట్లాడిన తర్వాత కథ చెప్పేందుకు టైం కావాలన్నాడు. అందుకు నేను సరేనంటూ కాఫీ షాప్ లో కూర్చుందామన్నాను. కాని అతడు మాత్రం తన రూంకు రావాలంటూ పిలిచాడు. ఆ సమయంలో అతడి మొహంలో మార్పులు కనిపించాయి. అతడి నవ్వులో నాకు చెడు ఆలోచన కనిపించింది. తాను రాలేనంటూ అతడిని వెళ్లి పోమంటూ డోర్ ఓపెన్ చేశాను.

విద్యా బాలన్ ఈ సందర్బంగా.. ఏ దర్శకుడితో ఆ అనుభవం ఎదుర్కొన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కాని ఆ సంఘటన తన జీవితంలో మర్చిపోలేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విద్యాబాలన్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఈమె నటించిన మిషన్ మంగల్ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
Please Read Disclaimer