వారి నోటికి ఈ ‘పిక్’ తో తాళం

0

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం అందరికి తెల్సిందే. ఇన్నాళ్లు బాహాటంగా బయటకు చెప్పని నయనతార ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుక లో తాను విఘ్నేష్ శివన్ ప్రేమలో చాలా సంతోషంగా ఉన్నాను.. ఆయన ప్రేమ మరియు సహకారంతో నేను నా కలలను సాకారం చేసుకుంటున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

కొన్ని రోజుల క్రితం న్యూ ఇయర్ వేడుకలను వీరిద్దరు కలిపి జరుపుకోక పోవడంతో పాటు గతంలో మాదిరిగా రెగ్యులర్ గా వీరు కలవక పోవడం తో వీరిద్దరు బ్రేకప్ అయ్యారా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియాలో వీరి ప్రేమ గురించి.. బ్రేకప్ గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగేలా చేసింది. నయనతార మరియు విఘ్నేష్ ల జోడీని అభిమానించే వారు చాలా మంది మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాకూడదని కోరుకున్నారు. ఇద్దరు కలిసి ఉండాలని ఆశించారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు బ్రేకప్ అంటూ పుకార్లు ప్రచారం చేస్తున్న వారి నోటికి తాళం వేసేలా విఘ్నేష్ శివన్ ఈ పిక్ ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేశాడు. నీ తో నా జీవితం చాలా సంతోషంగా సాగుతుంది అంటూ విఘ్నేష్ ఈ ఫొటోను షేర్ చేయడంతో ఇన్ని రోజులుగా వస్తున్న బ్రేకప్ వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.
Please Read Disclaimer