న్యూయార్క్ నగరంలో ప్రేమపావురాలు

0

అదేంటో గానీ ఎవరైనా లవ్ చేసుకుంటున్నారని తెలిస్తే చాలు.. మనకు ఎంత సభ్యత సంస్కారం ఉన్నా అన్నీ తీసి పక్కన పెట్టి వారి వివరాలు కనుక్కునేందుకు ఉత్సాహం చూపిస్తాం. ఇక ఆ లవర్స్ కనుక సెలబ్రిటీలు అయితే వారిపై ఆ ఆసక్తి రెట్టింపవుతుంది. అందుకేనేమో నయనతార-విఘ్నేశ్ శివన్ లవ్ స్టోరీ సౌత్ మొత్తం మీద చాలా ఫేమస్.

లేడీ సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నయనతార తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో చాలాకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. నయన్ – విఘ్నేశ్ శివన్ అసలు లవర్స్ కాదని.. ఇద్దరికీ ఎప్పుడో రహస్య డుండుంపీపీ అయిపోయిందని.. వారిద్దరూ భార్యాభర్తలని.. కొందరు కోలీవుడ్ లో చెవులు కూడా కొరుక్కుంటున్నారు. అయినా ఈ జంట తమ స్టేటస్ గురించి అధికారికంగా స్పందించదు. అయితే ఇద్దరూ ఫారెన్ వెకేషన్స్ కు వెళ్లిన సమయంలో మాత్రం ఏదో ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. నయన్ సోషల్ మీడియాకు ఒక బిలియన్ మైల్స్ దూరంగా ఉంటుంది కానీ విఘ్నేశ్ మాత్రం యాక్టివ్. అందుకే విఘ్నేశ్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటాడు.

ప్రస్తుతం నయన్- విఘ్నేశ్ జంట న్యూయార్క్ హాలిడేలో ఉన్నారు. నవంబర్ 18 న నయనతార పుట్టినరోజు.. దీంతో బర్త్ డే సెలబ్రేషన్స్ కోసమే న్యూయార్క్ వెళ్ళారని మనం అర్థం చేసుకోవచ్చు. విఘ్నేశ్ ఈ ఫోటోను పోస్ట్ చేసి “ఈ ఆకాశం & ఆమె చిరునవ్వు.. అలౌకికం. తన పుట్టినరోజు రాబోతోంది. ఈ నగరం చాలా చాలా అందమైనది. ఇక్కడ వణికించే చలి ఉంది.

#న్యూయార్క్ సిటీ #బ్రూక్లిన్ బ్రిడ్జ్ #నయనతార #లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోకు కామెంట్లలో ఎక్కువమంది నయన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home