కత్తి దాడి వరకు వెళ్లిన అభిమానం

0

తమిళనాట స్టార్ హీరోల అభిమానులు హద్దులు మీరడం.. కొన్ని సార్లు విచక్షణ కోల్పోవడం వంటివి చేస్తూనే ఉంటారు. తమ హీరో గొప్ప అంటూ అభిమానుల మద్య తమిళనాట ఎప్పటికప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇటీవలే విజయ్ యాంటీ ఫ్యాన్స్ వర్గం ఏకంగా విజయ్ మృతి చెందాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంతో తమిళనాడు మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. తాజాగా మరోసారి ఫ్యాన్స్ మద్య వార్ రక్తపాతంకు దారి తీసింది.

తమిళనాడులోని పుళల్ సమీపంలో శ్రీలంక శరణార్ధుల శిభిరంలో ఉంటున్న ఉమాశంకర్ మరియు రోషన్ లు తమ అభిమాన హీరోల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరి మద్య విభేదాలు తలెత్తాయి. అజిత్ కు వీరాభిమాని అయిన ఉమాశంకర్ మరియు విజయ్ కు అభిమాని అయిన రోషన్ లు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ గొడవ పెట్టుకోవడం జరిగింది. వారి గొడవ మెల్ల మెల్లగా పెరిగి పెద్దదయ్యింది.

కోపంలో విజయ్ అభిమాని అయిన రోషన్ కత్తితో అజిత్ అభిమాని అయిన ఉమాశంకర్ ను విచక్షణ రహితంగా పొడిచేశాడు. దాంతో వెంటనే స్థానికులు ఉమాశంకర్ ను హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి రోషన్ ను అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఇలా అభిమానుల మద్య కత్తి యుద్దాలు జరిగిన సంఘటనలు తమిళనాడులో ఉన్నాయి. హత్యలు కూడా చేసుకున్న చరిత్ర అక్కడ ఉంది. తమ అభిమానులకు ఆ హీరోలు చెప్పుకోలేక పోతున్నారు. ఆవేశంలో అభిమానంతో తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు.
Please Read Disclaimer