ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ పై కాజల్ ప్రేమ

0

టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు తమిళంలో పలు పెద్ద సినిమాల్లో నటిస్తూ ఉంది. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం పూర్తి అయినా కూడా ఇంకా ఈమె క్రేజ్ స్టార్ గానే కొనసాగుతుంది. తాజాగా ఈమె తమిళ స్టార్ హీరోలు విజయ్ మరియు అజిత్ ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇతర హీరోల ఫ్యాన్స్ ఈగోను హర్ట్ చేశాయి.

తమిళ స్టార్ హీరోలు అయిన విజయ్ అజిత్ లతో నటిస్తున్న సమయంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. వారిద్దరు చాలా గొప్ప నటులు అయినా కూడా వారిద్దరు వారితో నటించే తోటి నటీనటులకు పూర్తి స్వేచ్చ ఇస్తారు. వారితో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. విజయ్ తో నేను మూడు సినిమాలు చేశాను. ఇండస్ట్రీలో అత్యంత ట్యాలెంట్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఆయన చాలా సహజంగా నటిస్తారు. సెట్స్ లో ఉన్న సమయంలో మొత్తం ప్రపంచాన్ని మర్చి పోయి సినిమా గురించి ఆలోచిస్తారు. అందుకే ఆయనంటే ఒకరకమైన ప్రేమ ఆయనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటాను.

వివేకం సినిమాలో నటించడానికి ముందు అజిత్ సార్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయనతో ఒక్క సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అనుకున్నాను. ఒక అద్బుతమైన వ్యక్తి ఆయన అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. అందుకే ఆయన అన్నా కూడా నాకు చాలా ప్రేమ. ఆయనతో కూడా మళ్లీ సినిమా చేయాలని కోరుకుంటున్నాను అంది. ఇండస్ట్రీలో అంత మంది హీరోలతో నటించిన కాజల్ విజయ్ – అజిత్ లపై అంతగా ప్రేమను చూపుతు వ్యాఖ్యలు చేయడంపై ఇతర హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer