100 కోట్లతో నంబర్ వన్ అతడే

0

కోలీవుడ్ లో ఇలయదళపతి విజయ్ ఫాలోయింగ్… స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం రేంజ్ లో ఏలాడో…. కోలీవుడ్ ని అంతగా ఏల్తున్న ఏకైక స్టార్ అతడు. సూపర్ స్టార్ రజనీకాంత్… విశ్వనటుడు కమల్ హాసన్ లాంటి స్టార్లు ఉన్నా.. ఎవరితోనూ పోటీ అన్నదే లేకుండా తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న విజయ్ బాక్సాఫీస్ వద్ద సునాయాసంగా వందల కోట్లు కొల్లగొట్టేస్తాడు. విజయ్ పై అక్కడి అభిమానులు గుడులు గోపురాలు కట్టేంత అభిమానం చూపిస్తారు. అందుకే అక్కడ సూపర్ స్టార్ అయ్యాడు. అయితే తాజాగా పారితోషికం అందుకోవడంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నే బీట్ చేశాడని కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ చర్చాంశనీయంగా మారింది.

విజయ్ తన 65 వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ లో చేయనున్నాడు. దీన్ని అసురన్ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకి విజయ్ అక్షరాల 100 కోట్లు పారితోషికం అందుకుంటున్నారట. ఇప్పటికే అడ్వాన్స్ గా 50 కోట్లు చేతికొచ్చేశాయని సమాచారం. ఇదే నిజమైతే ఇళయ దళపతి తలైవాని బీట్ చేసినట్లే . మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దర్బార్ చిత్రం కోసం రజనీకాంత్ అక్షరాలా 90 కోట్లు పారితోషికం తీసుకున్నారని ప్రచారమైంది. దీంతో కోలీవుడ్ లో ఇప్పటివరకూ నెంబర్ వన్ గా రజనీ పేరు వినిపించింది. ఇంతలోనే ఆ రికార్డును విజయ్ బ్రేక్ చేశాడన్న వార్త వేడెక్కిస్తోంది.

దళపతిని మించి ఇలయదళపతి పారితోషికం అందుకుంటున్నాడట. తాజాగా 100 కోట్లు అందుకుంటున్నాడన్న ప్రచారం వెడెక్కిస్తోంది. మొత్తానికి టాప్ ప్లేస్ మారుతోంది అంటూ విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పారితోషికం 100 కోట్లు ఇస్తున్నారంటే సన్ పికర్స్ ఈ సినిమాకి కేటాయించే బడ్జెట్ ఎంతో ఊహిస్తేనే షాక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ రచ్చ షురూ చేసారు. ప్రస్తుతం విజయ్ ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో మాస్టర్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer