రౌడీ స్టార్ లో టెన్షన్ దేనికి?

0

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `ఫైటర్` తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబైలో షూటింగ్ మొదలు పెట్టారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ మెజారిటీ పార్ట్ ముంబైలోనే చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. దానికి సంబంధించి పూరి కనెక్స్ట్ టీమ్ మొత్తం ముంబైలోనే మకాం వేసింది. పూరి -ఛార్మి బృందం కరణ్ జోహర్ తో కలిసి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు-తమిళం- హిందీ భాషల్లో పాన్ ఇండియా కేటగిరీ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పూరి మరింత ప్రతిష్ఠాత్మకం గా భావించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో విజయ్ స్టార్ డమ్ ని పీక్స్ కి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు.

మాస్ మహారాజా రవితేజకి `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లా`.. మహేష్ కి `పోకిరి`లా…విజయ్ కెరీర్ లో ఫైటర్ టాలీవుడ్ హిస్టరీలో మిగిలిపోయే చిత్రంలా ఉంటుందని బయట ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రివీలైంది. ఈ సినిమా కోసం పూరి ముంబైలో 5 కోట్ల ఖరీదైన భారీ సెట్ వేస్తున్నారుట. ఇందు లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సాధారణంగా పూరి సినిమాలకు సెట్లు వేయడు. నేచురల్ లోకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేస్తాడు. ఒకవేళ సెట్ వేసినా భారీగా వెచ్చించడు. తక్కువ బడ్జెట్ లోనే తేల్చేస్తాడు. పూరి మొత్తం సినిమానే 30 నుంచి 40 కోట్ల మధ్య డిజైన్ చేయగలడు.

కానీ ఈసారి బడ్జెట్ పరంగా లావిష్ గానే ఖర్చు చేస్తున్నారట. రౌడీ కోసం 5 కోట్ల బడ్జెట్ తో సెట్ వేస్తున్నాడంటే? పూరి ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడో అర్ధమవుతోంది. పూరి వెనుక కరణ్ జోహార్ సహకారం కూడా ఉండటం తో చిత్రీకరణ విషయం లో ఏమాత్రం రాజీ పడటం లేదు. గురువారం నుంచి విజయ్ షూటింగ్ లో పాల్గొంటాడు. విజయ్ తొలిసారి డ్యాషింగ్ డైరెక్టర్ తో పని చేస్తుండటంతో కాస్త టెన్షన్ ఫీలవుతున్నట్లు రివీల్ చేసాడు. ఛాలెంజింగ్ రోల్ కావడం తో దానికి తగ్గట్టు ప్రీపేర్ అవుతున్నాడుట. ఆన్ సెట్స్ లో పూరితో ఒకటికి రెండుసార్లు చెప్పించుకోకుండా ముందు రోజు రాత్రి సెట్ లో ఎలా నటించాలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. తొలిసారి పూరి ముందు నటించాలంటే టెన్షన్ గాను..ఆందోళనగాను ఉందన్నాడు. పూరి సెట్ లో చాలా సీరియస్ గా ఉంటాడు. కంప్లీట్ వర్క్ మోడ్ లో ఉంటాడు. తనకు నచ్చినట్లు ఔట్ పుట్ ఇవ్వకపోతే తొందరగా వదిలి పెట్టడు. అందుకే రౌడీస్టార్ ముందస్తు ప్రిపరేషన్ సాగిస్తున్నాడట.
Please Read Disclaimer