పేరు మార్చుకుంటున్న రౌడీ?

0

సెంటిమెంటు పరిశ్రమ లో సెంటిమెంటును అనుసరించని హీరోని చూడగలమా? ముహూర్తం చూడకుండా ఠెంకాయ కొట్టే నిర్మాతల్ని.. హీరోల్ని చూడగలమా? అస్సలు ఛాన్సే లేదు. అందరూ ఆర్జీవీ- పూరి కాంపౌండ్ లా ఉంటారా? వాళ్లయినా లాంచింగ్ లో ఠెంకాయలు కొడతారు మరి!

అదంతా సరే కానీ.. ఇటీవలి కాలంలో హీరోలకు ఏదైనా కలిసి రాక పోతే వెంటనే సంఖ్యా శాస్త్రం పేరుతో పేరును మార్చేసుకుంటున్నారు. ఇంతకుముందు సాయి ధరమ్ తేజ్ కాస్తా `ధరమ్`ని లేపేసి సాయి తేజ్ గా మారాడు. ఆ తర్వాత చిత్రలహరి- ప్రతిరోజూ పండగే చిత్రాలతో హిట్లు కొట్టాడు.

ఇప్పుడు అదే బాట లో విజయ్ దేవరకొండ నేమ్ ఛేంజ్ చేస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి విజయ్ దేవరకొండ పూర్తి పేరు విజయ్ సాయి దేవరకొండ. అందులోంచి సాయి తీసేసి విజయ్ దేవరకొండ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఆ సాయిని యాడ్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇకపై స్క్రీన్ పై `విజయ్ సాయి దేవరకొండ` అని వేయబోతున్నారట. అక్కడ సాయి ధరమ్ లో ధరమ్ ని తొలగిస్తే.. ఇక్కడ విజయ్ కి సాయిని యాడ్ చేస్తున్నారన్నమాట. ఇదంతా డియర్ కామ్రేడ్ ఎఫెక్టేనా? తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ తోనే ఈ కొత్త పేరును పాపులర్ చేస్తాడా? అన్నది వీడీనే చెప్పాలి.
Please Read Disclaimer