కొత్తింట్లో దేవరకొండ ఫ్యామిలీ

0

టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ విజయ్ దేవరకొండ ఇటీవలే తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసిన విషయం తెల్సిందే. ఫిల్మ్ నగర్ లో ఒక ఖరీదైన ఇంటిని విజయ్ దేవరకొండ కొనుగోలు చేసి దాన్ని తన అభిరుచి కి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయించి ఇటీవలే గృహ ప్రవేశం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు ఏమీ కూడా బయటకు రాలేదు. ఇండస్ట్రీకి చెందిన అతి కొద్ది మంది సన్నిహితులను మాత్రమే విజయ్ దేవరకొండ ఆహ్వానించాడు.

విజయ్ దేవరకొండ తన కొత్త ఇల్లు గృహ ప్రవేశం గురించి అధికారికం గా తెలియజేస్తూ ఈ ఫొటో ను పోస్ట్ చేశాడు. సంతోషంగా.. గర్వంగా ఉందని గృహ ప్రవేశం జరిగిందన్నాడు. మీ ప్రేమ అభిమానంతో ఈ స్థాయికి వచ్చాను.. ఈ జర్నీలో మీ భాగస్వామ్యం చాలా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. విజయ్ దేవరకొండ మరియు తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో పాటు వారి తండ్రి కూడా అచ్చ తెలుగు పంచె కట్టుతో పాటు దేవరకొండ మదర్ కూడా చాలా హుందాగా ఈ ఫొటోలో ఉన్నారంటూ రౌడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొత్త ఇల్లు గృహ ప్రవేశం సందర్బంగా శుభాకాంక్షలు అంటూ విజయ్ దేవరకొండను ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తారు.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెంటనే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమాను విజయ్ చేయబోతున్నాడు. ఇంకా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరో వైపు బాలీవుడ్ లో కూడా విజయ్ ఒక సినిమా కు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Please Read Disclaimer