రౌడీకి వారం రోజులుగా నిద్ర పట్టడం లేదట

0

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ చిత్రంలో నటించింది. తాజాగా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమా కోసం తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లుగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు పడ్డ కష్టంను మర్చి పోయేందుకు అయిదు రాష్ట్రాలు తిరుగుతూ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటూ ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నామన్నాడు.

ఇంకా విజయ్ మాట్లాడుతూ… ముందుగా దర్శకుడు భరత్ కు థ్యాంక్స్ చెప్పాలి. సినిమా కోసం టీం మొత్తం చాలా కష్టపడింది. ట్రైలర్ బాగా కట్ చేసేందుకు నాలుగైదు రోజులుగా నిద్ర కూడా సరిగా పోకుండా కష్టపడ్డారు. ఈరోజు ట్రైలర్ విడుదల ఉండటంతో నేను ఉదయం 6 గంటలకే లేచాను. కాని మా తమ్ముడు రేపు సినిమా విడుదల ఉన్నా కూడా ఉదయం 9 గంటల వరకు పడుకునే ఉన్నాడు. నా సినిమా ఇంకా చాలా రోజులు ఉన్నా కూడా నాకేమో నిద్ర పట్టడం లేదు. సంవత్సర కాలంగా సినిమా మా చేతిల్లో ఉంది. త్వరలో ప్రపంచం మొత్తానికి చూపించబోతున్నాం. సాదారణంగా నేను చాలా చిల్ గా ఉంటాను. నా గత సినిమాల విడుదల రోజు కూడా 12 గంటల వరకు పడుకున్న రోజులు ఉన్నాయి. కాని ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త విరుద్దంగా జరుగుతుంది. బాడీలోని అడ్రినల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందేమో మంచి కిక్ ఇస్తోంది. సినిమా కోసం సంవత్సరం పాటు కష్టపడ్డాం. ఇక సినిమా విడుదల నేపథ్యంలో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాం. అందుకోసం మీ వద్దకు వస్తున్నాం. మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ సినిమా ప్రమోషన్స్ చేయబోతున్నాం. అయిదు రాష్ట్రాల్లో కూడా తిరగబోతున్నాం. వెన్యూ ఎక్కడో తెలుసుకుని వచ్చేయండి. నేను ఈ స్టేజ్ లో ఉండటానికి కారణం అయిన మీకు మ్యూజికల్ ఫెస్టివల్స్ కు ఫ్రీ ఎంట్రీ. రేపు బెంగళూరులో జరిగే మ్యూజిక్ షోకు యష్ భాయ్ రాబోతున్నాడు. అందరు అక్కడికి రావచ్చు అన్నాడు.

మొత్తానికి ఈ రెండు వారాల్లో డియర్ కామ్రేడ్ ను నాలుగు భాషల్లో కూడా అగ్రెసివ్ గా ప్రమోట్ చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లబోతున్నారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా ఆయన మాటల ద్వారా అనిపిస్తుంది.
Please Read Disclaimer