జాన్వీ కోసం పూరి స్పాట్ మార్చాడా?

0

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `ఫైటర్` అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి నటీనటులను ఎంపిక చేసే పనుల్లో తలమునకలయ్యారు. పూరితో పాటు ఛార్మి ముంబైలో మకాం వేసి అన్వేషిస్తున్నారు. హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీని ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. స్క్రిప్ట్ విని నచ్చడంతో పాటు..రౌడీ స్టార్ తో నటించాలన్న కోరిక తీరుతుందని జాన్వీ అనుకుంది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది.

అమ్మడు బిజీ షెడ్యూల్ కారణంగా ఫైటర్ కి డేట్లు కేటాయించలేకపోతోందని.. ఆ క్రమంలోనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ప్రచారమైంది. దీంతో షాక్ తిన్న పూరి కొత్త హీరోయిన్ ని వెతుక్కునే పనిలో పడ్డారన్న వార్తలు వచ్చాయి. అయితే పూరి జాన్వీనే మైండ్ లో ఫిక్స్ అయినట్లు తాజా సీన్ చెబుతోంది. ఎంతమంది కొత్త భామల్ని చూసినా పూరి కన్విన్స్ కాలేకపోతున్నాడుట. ఈ నేపథ్యంలో షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చేసి అక్కడే పూర్తి చేస్తే జాన్వీ దొరుకుందని సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాడట.

ఫిబ్రవరిలో జాన్వీ నటించనున్న తక్త్ షూటింగ్ ప్రారంభం కానుంది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ కు కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్త్ కి సమీపంలో ఫైటర్ కి అవసరమయ్యే సరంజామా రెడీ చేసి జాన్వీ ని ఒప్పిస్తే సరిపోతుందని పూరి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడుట. పూరి ఐడియా గనుక వర్కవుట్ అయితే జాన్వీ మిస్సయ్యే అవకాశం లేదు. చూద్దాం ఫైటర్ కి జాన్వీ ఛామ్ యాడవుతుందో లేదో.
Please Read Disclaimer