రౌడీ గారి 9వ సినిమా టైటిల్ ఇదే!

0

`డియర్ కామ్రేడ్` ఫెయిల్యూర్ తర్వాత విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. విజయదేవరకొండ కెరీర్ 9వ సినిమా ఇది. VD9 గా ప్రచారంలో ఉంది. అయితే దీనికి టైటిల్ ని రేపు (సెప్టెంబర్ 17) ఉదయం 11గంటలకు రివీల్ చేయనున్నామని నిర్మాతలు ప్రకటించారు.

క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై టైటిల్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీనిపై నిర్మాతలు కె.ఎస్.రామారావు-కె.ఏ వల్లభ ఎంతో జాగ్రత్త తీసుకున్నారట. ఇదివరకూ సాయిధరమ్ తో నిర్మించిన సినిమాకి `తేజ్.. ఐ లవ్ యు` అంటూ స్ట్రైకింగ్ టైటిల్ ని నిర్ణయించారు. అది ప్రేమకథా చిత్రం. అలాగే క్రాంతి మాధవ్ తో `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` అనే క్లాసిక్ టైటిల్ తో సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు. ఈసారి కూడా దేవరకొండతో తీస్తున్నది ప్రేమకథా చిత్రమే. క్రాంతి మాధవ్ మార్క్ ఎమోషనల్ లవ్ స్టోరి కాబట్టి టైటిల్ అంతే ఆసక్తికరంగా ఉంటుందట.

టైటిల్ ఎలా ఉంటుంది అంటే.. లవర్ అనే పదంతో ఉంటుందట. `వరల్డ్ గ్రేటెస్ట్ లవర్` అనే సౌండింగ్ ఉంటుందని తెలుస్తోంది. అయితే టైటిల్ ఎలానూ ఈ మంగళవారం నాడు రివీల్ చేస్తున్నారు కాబట్టి వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో రాశీఖన్నా- ఐశ్వర్యా రాజేశ్- క్యాథరిన్- ఇజబెల్లిలు తదితరులు నటిస్తున్నారు. టైటిల్ విషయమై ప్రస్తుతం ఫిలింనగర్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. ఇస్మార్ట్ పూరీతో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ అంతకంతకు వేడి పెంచుతోంది. ఆ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ ని నిర్ణయించారని వార్తలొచ్చాయి. లొకేషన్ల వేట సాగిస్తున్నారు పూరి. అలాగే మైత్రి సంస్థలో హీరో అనే ప్రాజెక్టును దేవరకొండ చేస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer