బిగ్ బాస్ లో రౌడీ గ్యాంగ్ హల్చల్

0

తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ `మీకు మాత్రమే చెప్తా` అనే చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రచారం స్పీడందుకుంది. నిర్మాత హోదాలో రౌడీ ఈ సినిమాను ఎన్ని రకాలుగా మార్కెట్ లోకి తీసుకెళ్లాలో? అన్ని రకాలుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మిగిలిన హీరోలందరి కంటే విజయ్ ప్రచార శైలి కాస్త భిన్నంగానే ఉంది. యూత్ లో తనకున్న ఫాలోయింగ్ ను తెలివిగా వాడుకుంటున్నాడు.

విజయ్ నేరుగా ఇప్పటివరకూ మీడియా ముందుకు రాకపోయినా ఆయన బ్యాకెండ్ టీమ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో పబ్లిసిటీ ప్లాన్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్-3 లోకి విజయ్ దేవరకొండ టీమ్ ఎంట్రీ ఇవ్వనుంది. తరుణ్ భాస్కర్- విజయ్ దేవరకోండ-అభినవ్ గోమటం తమ సినిమా ప్రచారంలో భాగంగా బిగ్ బాస్-3 హౌస్ లోకి వెళ్లారని తెలుస్తోంది. కంటెస్టెంట్లలో ఈ టీమ్ పుల్ జోష్ నింపినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ అంతా ప్రేక్షకులకు ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. హౌస్ లో ఈ ముగ్గరి హంగామా పీక్స్ లో ఉంటుందట. ఇంకా కొన్ని గంటల్లో ప్రసారం కానున్న షోలో ఈ ముగ్గురి హంగామా దీపావళి స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం దేవరకొండకు కొత్తేం కాదు. గతంలో రెండు సార్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లను ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసాడు. విజయ్ క్రేజ్ నేపథ్యంలో ఆ ఎపిసోడ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి హౌస్ లో తన సినిమా ప్రచారం కోసం ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు. అలాగే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Comments are closed.