రౌడీ మార్క్ టైటిల్ ప్రకటనా ఇది!

0

రౌడీ దేవరకొండ లాజిక్ తో కొడుతున్నాడు. తనని హీరోని చేసిన తరుణ్ భాస్కర్ ని హీరోని చేస్తూ రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేయడమే కాదు .. సొంతంగా బ్యానర్ స్థాపించి ఆఫర్ ఇవ్వడం ఆసక్తికరం. `రుణం తీర్చుకోవాలి` అన్న లాజిక్ ని ఇక్కడ బాగానే ఉపయోగించాడు.

తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా నిర్మించనున్న సినిమాకి అసలు పని ప్రారంభించిన దేవరకొండ. తొలిగా ఈ సినిమా టైటిల్ పై సీరియస్ గా థింక్ చేస్తున్నాడు. టైటిల్ పై చాలా లాజికల్ గానే ఆలోచించాడని అర్థమవుతోంది. ఏ టైటిల్ ని నిర్ణయించాలి? అన్న డైలమా లో .. టైటిల్ ఇదీ అంటూ ఓ వీడియో లీకును ఇచ్చారు. ఈ వీడియోలో `మీకు మాత్రమే చెబుతా` అంటూ టైటిల్ ని రివీల్ చేశారు. తరుణ్ భాస్కర్- విజయ్ దేవరకొండ- అభినవ్ ఈ వీడియోలో కనిపించారు. టైటిల్ మీకు మాత్రమే చెప్తా అంటూ విజయ్ వీడియోని లీడ్ చేశాడు. ఆ ముగ్గురి నోటి వెంటా ఆ టైటిల్ వినిపించింది. రౌడీ మార్క్ టైటిల్ ఇది. అయితే ఈ టైటిల్ ని ఎవరైనా లీక్ చేశారా.. లేక రౌడీనే టెస్ట్ చేయడం కోసం కావాలనే లీక్ చేయించాడా? అంటూ చర్చ వేడెక్కిస్తోంది. ఇలా టైటిల్ పై చర్చ మొదలవ్వగానే ఆ వీడియోని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. అంటే కొన్ని నిమిషాల పాటు టైటిల్ ఇదీ అని చర్చకు తెరలేపి జనాలకు నచ్చిందో లేదో టెస్ట్ చేశారని అంతా భావించాల్సి ఉంటుంది.

ఇక దేవరకొండ బ్యానర్ విషయానికి వస్తే… `కింగ్ ఆఫ్ ది హిల్` అనే వెరైటీ టైటిల్ ని ఇదివరకూ ప్రకటించారు. దీనికి ప్రత్యేకించి మీనింగ్ ఇదీ అని చెప్పలేం. విజయ్ దేవరకొండను ఇంగ్లీష్ లో పిలిస్తే అలా పిలవాలట. దేవర అంటే కింగ్.. కొండ అంటే హిల్ అలా విజయ్ దేవరకొండ కాస్తా కింగ్ ఆఫ్ ది హిల్ అయిపోయింది. ఈ బ్యానర్ లో మొదటి సినిమాని అలా ప్రారంభించేశారు.
Please Read Disclaimer