మూవీ డౌన్ లోడ్స్ నేరం కదా రౌడీ?

0

విజయ్ దేవరకొండ నటించిన `డియర్ కామ్రేడ్` ఈనెల 26న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సౌత్ నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది. తమిళం-మలయాళం-కన్నడంలో తన సినిమా పబ్లిసిటీ కోసం స్థానిక స్టార్లను అతడు సాయం కోరిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి-దుల్కార్- యశ్ వంటి స్టార్లు అతడికి ప్రచారం పరంగా సాయం చేస్తున్నారు. ఈ స్నేహాల మాట అటుంచితే నిన్నటిరోజున సడెన్ గా దేవరకొండ ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదు. అతడు ముంబై లో అడుగుపెడితే ఇంకేదో కారణం ఉందని భావించిన వారికి ఏకంగా పెద్ద షాక్ నిచ్చాడు. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నామని.. కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని నిర్మిస్తారని ప్రకటించి బిగ్ ట్విస్టిచ్చాడు.

అదంతా అటుంచితే విజయ్ ఓ మలయాళ చానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. మలయాళంలో తన సినిమా `డియర్ కామ్రేడ్` గురించి ప్రచారం చేస్తున్న దేవరకొండ .. తన స్నేహితుడు దుల్కార్ సల్మాన్ ప్రస్థావన తెచ్చారు. దుల్కార్ నటించిన సినిమాల్ని ఆన్ లైన్ పైరసీలో చూశానని చెప్పడం ఆశ్చర్యపరిచింది. ప్రేమమ్ చిత్రాన్ని డౌన్ లోడ్ చేసి చూశానని దేవరకొండ తెలిపారు. అయితే ఆన్ లైన్ పైరసీ నేరం. డౌన్ లోడ్స్ చేయడం నిషేధం. అది తెలిసీ దుల్కార్ సినిమాల్ని డౌన్ లోడ్ చేసి చూశానని విజయ్ పొరపాటున టంగ్ స్లిప్పయ్యారు. ఒక చానెల్ లైవ్ లోనే అతడు అలా నోరు జారడం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రౌడీ కొండ ఏం మాట్లాడినా సూటిగా మాట్లాడేయడం అలవాటు. కానీ పబ్లిక్ వేదికపై పైరసీ చేశానని అంగీకరించడం సరికాదని క్రిటిక్స్ విమర్శిస్తున్నారు. దానివల్ల జనంలోకి తప్పుడు సంకేతం వెళుతుంది. ఇప్పటికే పైరసీ వల్ల అన్ని పరిశ్రమలు ఇబ్బందులకు గురవుతున్నాయి. వందల కోట్ల బిజినెస్ కి నష్టం వాటిల్లుతోంది. అందుకే కొన్ని చేసినా బహిరంగ వేదికలపై వాటిని మాట్లాడకపోవడమే మేలు అని ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఇక పైరసీ విషయంలో ఇతర పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ నిర్మాతలే ఎక్కువగా పోరాడుతున్నారు. ఇక్కడ ప్రత్యేకించి పైరసీ సెల్ ఎంతో యాక్టివ్ గా పని చేసి ఆన్ లైన్ టొరెంట్లను నిర్మూలిస్తోంది. బాహుబలి రిలీజ్ సమయంలో ఇది మరింత ఉధృతమై ప్రస్తుతం కొంతవరకూ ఆపగలుగుతుండడం విశేషం. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన `డియర్ కామ్రేడ్` సినిమాని పైరసీ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత దేవరకొండకు మైత్రికి ఉందనడంలో సందేహం లేదు.
Please Read Disclaimer