ఆల్టో కార్ లో వస్తే వాచ్ మన్ ఏదోలా చూశాడు!

0

కొత్త ప్రొడక్షన్ హౌస్.. కొత్త దర్శకుడు.. కొత్త టీమ్.. కొత్త నిర్మాత.. రౌడీ మరో ప్రయోగం ఇది. హీరోగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ `మీకు మాత్రమే చెప్తా` సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై విజయ్ మరోసారి అద్భుతమైన స్పీచ్ తో అలరించాడు.

కలలు కనండి ఆ కలలే మన హోప్ అంటూ రౌడీ ఫ్యాన్స్ కి సూచించాడు. తన కెరీర్ జర్నీలో సహకరించిన అందరికి ఈ వేదికపై పేరు పేరునా ధన్యవాదాలు చెప్పాడు. విజయ్ మాట్లాడుతూ..నటించగలనా అనుకున్నప్పుడు నాగ్ అశ్విన్ `ఎవడే సుబ్రమణ్యం` అనే బ్రేక్ నిచ్చాడు. `పెళ్లి చూపులు` చేయాలనుకున్నప్పుడు ఎవరూ లేరు. రాజ్ కందుకూరి గారు వచ్చారు.. సురేష్ గారు వచ్చారు. సందీప్ రెడ్డి వంగా వరంగల్ లో తన ఇంటిపై అప్పు తెచ్చి అర్జున్ రెడ్డి సినిమా తీశాడు. ఇంతమంది ఇంత చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇది అందరి శ్రమ. పెళ్లి చూపులు చిత్రాన్ని కిందా మీదా పడి తీస్తే రిలీజ్ ఎలానో తెలియలేదు. సురేష్ బాబు గారు ప్లాన్ చేసి మా లైఫ్ ని మార్చారు. గీతగోవిందంతో బుజ్జి డార్లింగ్ నా రాత మార్చాడు. పూరితో ఫైటర్ వస్తోంది ఇకపై. నా రౌడీ బోయ్స్ అండ్ గాళ్స్ కి నా పూర్తి ప్రేమతో చెబుతున్నా. ఇదంతా కలలా ఉంది.. నేను .. తరుణ్ చాలా మారాం. సెల్ఫీలు ఇస్తున్నాం. ఈ ప్రీరిలీజ్ కి వచ్చేప్పుడు నిర్మాతను అని నేను అనుకోలేదు. పెళ్లి చూపులు టైమ్ లో ఈ సినిమా రిలీజైతే చాలు అనుకున్నాం. సడెన్ గా ఇక్కడివరకూ వచ్చాం. తరుణ్ ని అడిగాను. నవ్వుకున్నాం. చూద్దాం ఎటు పోతోందో అనుకున్నాం“ అంటూ ఎగ్జయిట్ అయ్యాడు విజయ్.

ఐదేళ్ల క్రితం ఆడియో లాంచ్ లు చూస్తున్నాను. జనాలు అరుస్తూ సందడి చేస్తుంటే.. మనం కూడా ఒకరోజు అటు వెళ్లాలి అంటే ఏం చేయాలి అనుకున్నాను. చాలా మంది పెద్ద వాళ్లను కలవాలంటే భయం. ఆల్టో కార్ లో వెళితే వాచ్ మన్ కూడా అడిగేవాడు.. సరిగా సమాధానం చెప్పలేకపోయేవాడిని. నీ దగ్గర డబ్బులుంటే పూరి దగ్గర పని చెయ్ రా.. పూరి ఒక్కడే అసిస్టెంట్ డైరెక్టర్లకు డబ్బులిస్తాడు. అని నాన్న సలహా ఇచ్చారు. నేను పూరి దగ్గరకు వెళ్లలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ ని కలిసి వచ్చానని ఇంట్లో చెప్పా. ఇదంతా బ్యూటిఫుల్. వీరంతా నన్ను ధీవించడానికి రావడం .. నాతో పని చేయాలి అనుకోవడం హ్యాపీ అని ఆనందం వ్యక్తం చేశాడు. కలలు కనండి ఆ కలలే మన హోప్. సినిమాలు చేయాలి. అమెరికా వెళ్లాలి. ఎదగాలి అనుకుంటేనే ఇది సాధ్యం అని ఫ్యాన్స్ కు సూచించాడు. ఈరోజు కొందరు కొత్త వారికి అవకాశాలిస్తూ పది మంది అబ్బాయిలు అమ్మాయిల కల నెరవేర్చడంలో అదో తృప్తి అని ఎమోషన్ అయ్యాడు. ఫ్యాన్స్ ముందు ఆనందం వ్యక్తం చేశాడు.
Please Read Disclaimer