సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విజయ్ దేవరకొండ

0

తన పేరు మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తెరచి అమ్మాయిలతో మాట్లాడుతూ.. మోసం చేస్తున్న ఒకడిని యువ నటుడు విజయ్ దేవరకొండ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ నిందితుడు కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. విజయ్ దేవరకొండ చేసిన పనికి అభిమానులతో పాటు మహిళలు అభినందిస్తున్నారు. తమ అభిమానులకు చేరువగా ఉండాలని వారితో నేరుగా కాంటాక్ట్ ఉండాలని భావించి సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా వలన ఎంత ప్రయోజనం ఉన్నా అది దుర్వినియోగానికి గురవుతుంది.

నటుడు విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ను వాడుకుని క్యాష్ చేసుకోవాలని ఓ వ్యక్తి భావించాడు. దీంతో వెంటనే విజయ్ దేవరకొండ పేరుతో ఫేసు బుక్ లో ఓ అకౌంట్ తెరిచాడు. విజయ్ కు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. దీంతో విజయ్ దేవరకొండ అకౌంట్ కనిపించగానే ఫ్రెండ్ రిక్వెస్ట్ లు లైక్ లు వచ్చాయి. ఆ రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేసి అందమైన అమ్మాయిలతో విజయ్ దేవరకొండ పేరుతో అతడు చాటింగ్ చేస్తున్నాడు. రిక్వెస్ట్లు పంపిస్తున్న వారిలో అందమైన అమ్మాయిలను గుర్తించి వారితో నేరుగా చాటింగ్ చేస్తూ వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ అమ్మాయిలు అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత తాను నేరుగా చాటింగ్ చేస్తానంటూ విజయ్ దేవరకొండలా చెబుతూ కొందరిని వలలో వేసుకున్నాడు.

ఆ వివరాలతో ఆ యువతులను సంప్రదించి వాట్సాప్ చాటింగ్ చేస్తూ కొద్దిరోజులకు వారితో ప్రేమ పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి సహ జీవనం చేద్దామంటూ తీవ్రంగా వేధిస్తున్నాడు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు బాధిత యువతులు బయటకు రాలేదు. కానీ ఈ విషయాన్ని ఇటీవల కొందరు విజయ్ దృష్టికి తీసుకెళ్లారంట. వెంటనే దీనిపై విజయ్ దేవరకొండ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన అసిస్టెంట్ గోవింద్ ద్వారా హేమ పేరుతో ఫేసు బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టించి చాటింగ్ చేయించాడు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ని ఓకే చేసిన సైబర్ నేరగాడు తాను విజయ్ దేవరకొండ డబ్బింగ్ ఆర్టిస్ట్నంటూ మాయమాటలు చెప్పి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించాడు.

దీంతో వెంటనే విజయ్ స్పందించి తన మేనేజర్ ద్వారా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి అతడిని గాలించేందుకు చర్యలు చేపట్టారు. ఆ నిందితుడు సుమారు 10 మంది యువతులను మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికం గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-