రౌడీగారి వాట్సాప్ చాట్.. జోక్స్ వేస్తున్నారు!

0

యువ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాతో ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేసి తమ ఫ్రెండ్ షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అందరికీ పరోక్షంగా చెప్పాడు. విజయ్ తన సినిమాలకు డిఫరెంట్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తాడనే సంగతి తెలిసిందే. నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సైతం అదే స్టైల్ ఫాలో అవుతున్నాడు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న తరుణ్ భాస్కర్ ఒక వాట్సాప్ చాట్ లీక్ చేస్తే అది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. తరుణ్ భాస్కర్ తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ ని పార్టీకి పిలవడం.. విజయ్ ఆ పార్టీకి రాలేనని చెప్పడం.. ఫైనల్ గా విజయ్ ని కాలేజ్ స్టూడెంట్స్ కోసం ‘మీకు మాత్రమే చెప్తా’ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని కోరడం.. విజయ్ అందుకు ఒప్పుకోవడం.. ఇది దాని సారాంశం. ఈ వాట్సాప్ చాట్ అందరినీ ఆకట్టుకున్నమాట నిజమే కానీ దీనిపై సోషల్ మీడియాలో ఫుల్ గా సెటైర్లు పడుతున్నాయి.

సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ ఆశించినంతగా లేవు. మొదటిరోజు నుంచి పరిస్థితి అలానే ఉంది. సోమవారం నుంచి సినిమా పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారింది. ఈ సమయంలో కాలేజ్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేస్తాం.. అనడంపై జోక్స్ పేలుతున్నాయి. యూత్ ఈ సినిమాను ఓన్ చేసుకోలేదన్నది స్పష్టం. షార్ట్ ఫిలిం కి ఎక్కువ.. సినిమాకు తక్కువ అనే టాక్ కూడా ఉంది.. ఇప్పుడు సినిమా కోసం ఎన్ని మార్కెటింగ్ మంత్రాలు వేసినా కలెక్షన్స్ రాలే పరిస్థితి లేదని అంటున్నారు. టికెట్లు తెగక పోవడంతో ఫ్రీ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు. విజయ్ కి యూత్ లో ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది.. అయితే ఇలాంటి ప్రమోషన్స్ తో అది కూడా దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home