విజయ్ జోక్యం వల్లే ఇలా అయ్యిందా ?

0

డియర్ కామ్రేడ్ ఫలితం తెలిసిపోయినా ఇంకా మొదటి వారం కాలేదు కాబట్టి కలెక్షన్స్ ని పుష్ చేసేందుకు యూనిట్ విశ్వప్రయత్నం చేస్తోంది. వీక్ డేస్ డ్రాప్ ఊహించిన దాని కన్నా చాలా ఎక్కువగా ఉండటం బయ్యర్లను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే కొంత వెర్షన్ ను ట్రిమ్ చేయడం కాలేజీ క్యాంపస్ సాంగ్ జోడించడం లాంటివి చేస్తున్నా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చని లెక్కలు చెబుతున్నాయి. మంచి లైన్ తో పాటు దర్శకుడు ఆలోచించిన విధానం బాగుంది కానీ తెరమీద మాత్రం అలా ఎందుకు వచ్చిందన్న విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి.

ముఖ్యంగా అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రాకుండా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ క్యారెక్టరైజెషన్ ను సైతం అదే తరహాలో మార్చేలా దర్శకుడు భరత్ కమ్మ మీద ఒత్తిడి తెచ్చాడని అందుకే అవుట్ ఫుట్ మారిపోయిందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ముందు అనుకున్న రెండున్నర గంటల వెర్షన్ కు బదులుగా మరో ఇరవై నిమిషాలు జోడించడం కూడా విజయ్ ఆలోచనేనని వాటి సారాంశం. ఈ కారణంగానే చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయ్ అంత అగ్రెసివ్ ప్రమోషన్ చేశాడని చెబుతున్నారు.

ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే తాను చేసిన సూచనల వల్లే అని చెప్పుకునే అవకాశం ఉండేదని తీరా ఇప్పుడు రిజల్ట్ మరోలా రావడంతో ఏమి చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని చర్చించుకుంటున్నారు. నిజంగా స్క్రిప్ట్ లో విజయ్ ప్రమేయం ఉందా లేదా అనే నిర్ధారణ లేదు కానీ ఇలాంటి టాక్స్ ఖచ్చితంగా ఒకరకమైన అభిప్రాయం కలిగిస్తాయి. నాలుగు భాషల్లో విడుదల చేయాలన్న తపన కాకుండా ఇంకాస్త శ్రద్ధగా క్వాలిటీ మీద కంటెంట్ మీద దృష్టి పెడితే డియర్ కామ్రేడ్ ఈ సీజన్ లోనే బెస్ట్ ఆప్షన్ గా నిలిచేది. చేతులారా ఛాన్స్ మిస్ అయినట్టే.
Please Read Disclaimer